దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

‘కల్కి 2’ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ప్రముఖ కథానాయిక దీపిక పడుకొణె భాగం కాదు. ఈ మేరకు ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ ప్రకటన కూడా చేసింది. సినిమా నుండి ఆమె తప్పుకుందా? లేక ఆమెను ఇక చాలు అని పంపించేశారా అనేది తెలియదు. ఈ విషయంలో కొన్ని రోజులు జరిగిన చర్చ ఇప్పుడు వేరే టర్న్‌ తీసుకుంది. ఆ పాత్ర కోసం ఎవరైతే బాగుంటారు అంటూ సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఫలానా హీరోయిన్‌ అయితే బాగుంటుంది చెబుతున్న మాటల్లో ఓ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

Anushka

‘కల్కి 2898 AD’ సినిమాలో సుమతిగా ఓ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది దీపిక. దీంతో ఆ పాత్రను ఆమెలా స్టార్‌ హీరోయిన్‌ అయి ఉంది, చూడగానే భలే కుదిరిందే అనిపించాలా అంటే అనుష్క శెట్టి అయితేనే బెటర్‌ అనేది చాలా మంది అభిమానుల వాదన. గతంలో ప్రభాస్‌ – అనుష్క కలసి నటించిన సినిమాలు, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, స్క్రీన్‌ ప్రజెన్స్‌ను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టుఉ కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కాంబోకి ఎలాంటి ట్రోలింగ్‌ కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే డార్లింగ్‌ ఫ్యాన్స్‌కే కాదు.. సినిమా ప్రేక్షకులు అందిరకీ ఆ జోడీ చాలా స్పెషల్‌.

అనుష్క పేరు కాకుండా బాలీవుడ్‌, టాలీవుడ్‌లోని కొత్త హీరోయిన్లు, సీనియర్‌ హీరోయిన్ల పేర్లు చర్చలోకి వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు టీమ్‌ కొత్త హీరోయిన్‌ ప్రకటనను చేస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే రెండేళ్ల తర్వాత కానీ ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం లేదని ప్రభాస్‌ సినిమాల లైనప్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం డార్లింగ్‌ చేతిలో ‘ది రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘సలార్‌ 2’ ఉన్నాయి. ఇది కాకుండా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మ రాక్షస’లో నటిస్తాడని టాక్‌.

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus