Prabhas, Nani: ఆ విషయంలో ఈ ఇద్దరు హీరోలు హీరోలు గ్రేట్ అంటున్న ఫ్యాన్స్!

  • March 20, 2024 / 10:30 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమాలో నటించడం వల్ల ఏడాదిలో చాలా రోజులు థియేటర్లు వెలవెలబోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు విడుదలైతే మాత్రమే థియేటర్లు కళకళలాడే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రభాస్ (Prabhas) , నాని (Nani) మాత్రమే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. ఈ ఇద్దరు హీరోలు ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ హీరోలు ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం వల్ల ఎక్కువమందికి ఉపాధి కలుగుతోంది. ఎక్కువ సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ స్థాయిని ప్రభాస్, నాని మరింత పెంచేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. వేగంగా భారీ సినిమాలలో నటించే జాబితాలో ఫస్ట్ ప్రభాస్ ఉండగా నాని సెకండ్ జాబితాలో ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki) సినిమాలో నటిస్తుండగ్తా ఈ సినిమా మే నెల 9వ తేదీన థియేటర్లలో రిలీజవుతుందో లేక మరో తేదీన విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాజాసాబ్(The Raja Saab) , స్పిరిట్ (Spirit) మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. హాయ్ నాన్న (Hi Nanna) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాని సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram), ఎల్లమ్మ సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

ఈ సినిమాలతో పాటు నాని మరిన్ని ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. నాని సినిమాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. ప్రభాస్, నాని సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను పెంచుకుంటున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ హీరోలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus