Vijay Sethupathi: విజయ్ సేతుపతికి భారీ షాకిచ్చిన ఫ్యాన్స్!

  • October 1, 2021 / 07:22 PM IST

విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు సినిమాల్లో నటన ద్వారా విజయ్ సేతుపతి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఏ పాత్రనైనా తన ప్రతిభతో సులభంగా చేయగలనని విజయ్ సేతుపతి ప్రూవ్ చేసుకున్నారు. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటుడిగా పేరు సంపాదించుకున్న విజయ్ సేతుపతి నటించిన సినిమాలకు బిజినెస్ కూడా భారీస్థాయిలో జరుగుతోంది. తమిళ నటుడు అయినప్పటికీ ఇతర భాషల్లో సైతం ఎక్కువ సంఖ్యలో విజయ్ సేతుపతికి ఆఫర్లు వస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి నటించి రిలీజైన సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నాయి. విజయ్ సేతుపతి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. ఫ్యాన్స్ విజయ్ సేతుపతికి సోషల్ మీడియా వేదికగా రిక్వెస్టులు పెడుతున్నారు. మొహమాటం లేదా ఇతర కారణాల వల్ల చెత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవద్దని విజయ్ సేతుపతికి చెబుతున్నారు. ఆసక్తిగా ఉండే కథలను, సక్సెస్ సాధించే కథలను మాత్రమే విజయ్ సేతుపతి ఎంచుకోవాలని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు.

అభిమానుల కామెంట్లను దృష్టిలో పెట్టుకుని విజయ్ సేతుపతి కథల ఎంపిక విషయంలో మారతారేమో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతి భవిష్యత్తు సినిమాలు కూడా ఫ్లాప్ అయితే అతని కెరీర్ పై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ కోసం విజయ్ సేతుపతికి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. మరో రెండేళ్ల వరకు విజయ్ సేతుపతి కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారని సమాచారం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus