Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

పోలిక.. టాలీవుడ్‌ అనే కాదు, మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలో ఫ్యాన్‌ వార్స్‌కి కారణమవుతున్న ఏకైక అంశం ఇదే. మీ హీరో ఇంత, మా హీరో ఇంత.. మీ హీరో ఇలా, మా హీరో అలా అంటూ లేనిపోని పోలికలు పెట్టుకుని మాట్లాడటం వల్ల మాటా మాటగా మొదలై.. లేనిపోని చర్చలకు దారి తీసి.. రచ్చ చేసే అంశం ఇది. దీని వల్ల ఒకప్పుడు ఉన్న సమ ఉజ్జీల మల్టీస్టారర్‌ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. ఒకప్పుడు ఈ ఎలిమెంట్‌ లేకపోవడం వల్ల పెద్ద హీరోలు సైతం కలసి సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నం జరుగుతుండటంతో ఈ పోలిక కాన్సెప్ట్‌లు బయటకు వస్తున్నాయి.

Kamal Haasan, Rajinikanth

సుమారు 47 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజ నటులు కలసి నటించబోతున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరక్షన్‌లో ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను నెల్సన్‌ తనదైన శైలిలో వీడియో రూపంలో చేశారు. ఇద్దరు హీరోలు టిప్‌టాప్‌గా రెడీ అయి.. ఓ కారు షెడ్‌లోకి వెళ్లి (అందమైన అమ్మాయిలు ఉన్న) స్పెషల్‌ కార్‌ను తీసుకొని బయటకు వస్తారు. రెడీ అవ్వడం దగ్గర నుండి.. కారు స్టార్ట్‌ చేసేవరకు మొత్తం సీన్స్‌ చూడటానికి సగటు సినిమా అభిమానికి రెండు కళ్లు చాలవు. అంతలా వైభవంగా ఉందా వీడియో.

అయితే, ప్రతి విషయంలో పోలిక పెట్టి, పుల్లలు పెట్టే కొందరు కమల్‌ హాసన్‌ని రజనీకాంత్ డామినేట్‌ చేశాడని.. తలైవాని కమల్‌ ఓవర్‌ టేక్‌ చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మాటల వరకు ఉన్న ఈ డిస్కషన్‌ రేపొద్దున సినిమా వచ్చే సమయానికి ఎటు వెళ్తుంది అనేదే ఇక్కడే పాయింట్‌. ఇన్నేళ్ల తర్వాత రెండు పవర్‌ హౌస్‌లు కలసి నడుచుకుంటూ వస్తుంటే చూసి ఆనందించడకుండా ఇలా మాట్లాడి ఏం సాదిద్ధామని బ్రదర్స్‌ అంటూ తటస్థలు అంటున్నారు. మరి ఈ మాటల్ని ఫ్యాన్స్‌ వింటారా?

ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus