NTR30: ఎన్టీఆర్30 మూవీ విషయంలో అభిమానుల డిమాండ్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్ద హీరోల సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఆ సినిమాల రిలీజ్ డేట్లు సైతం మారుతున్నాయి. పవన్ క్రిష్ కాంబో మూవీ, మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ, ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్లను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ విషయంలో ఈ తప్పు జరగకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్, చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఎన్నో రిలీజ్ డేట్లను మార్చుకుని ఆలస్యంగా థియేటర్లలో విడుదలైంది.

ఎన్టీఆర్30 మూవీ షూట్ తాజాగా ప్రారంభం కాగా మాంటేజ్ షాట్స్ ను షూట్ చేశారని బోగట్టా. తారక్ లుక్ కొత్తగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ లుక్ తో పాటు టైటిల్ ను రివీల్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాదే ప్రశాంత్ నీల్ సినిమాను మొదలుపెట్టనున్నారు.

ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ కాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా డార్క్ షేడ్స్ లో ఉండనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. ఎన్టీఆర్ కు సోలో హీరోగా తర్వాత ప్రాజెక్ట్ లు కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడతాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ఫ్యాన్స్ మెచ్చే సినిమాల్లో నటించాలని తారక్ భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కథ మరీ అద్భుతంగా ఉంటే తప్ప మల్టీస్టారర్స్ లో నటించవద్దని ఫ్యాన్స్ సూచనలు చేస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరిన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వస్తాయేమో చూడాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus