ఆ పాత్రలో రష్మిక ను చూడాలనుకుంటున్నారట..!

  • June 4, 2020 / 09:15 PM IST

2018లో విడుదలైన ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక మందన. తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని రెండేళ్ళలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ చిత్రంతో మరో రెండు సూపర్ హిట్లు కొట్టి.. మరింత స్ట్రాంగ్ గా నిలబడింది.అంతేకాదు ఇప్పుడు ఈమెను గోల్డెన్ లెగ్ అని కూడా అంటున్నారు.గతంలో సమంత ను కూడా అలాగే పిలిచే వారు. ఇదిలా ఉండగా..

ఇప్పుడు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ వస్తుంది రష్మిక మందన. ఈ క్రమంలో రష్మిక ను కూడా సమంత గతంలో చేసిన ఓ సినిమాలోని పాత్రలో చూడాలనుకుంటున్నారట. ఇంతకీ ఏంటా చిత్రం? ఏంటా పాత్ర అనుకుంటున్నారా? ఆ చిత్రం మరేదో కాదు మన..

వెంకటేష్, మహేష్ బాబు లు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం. ఇందులో మహేష్ సరసన సమంత నటించింది. చిన్నోడిని ప్రేమించే గీత పాత్రలో ఆమె ఎంతో సరదాగా నటించి అలరించింది. అలాంటి పాత్రే రష్మిక కూడా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. మరి అలాంటి పాత్ర రష్మిక కోసం ఏ డైరెక్టర్ క్రియేట్ చేస్తాడో. అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో వేచి చూడాల్సిందే.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus