నేను ఫలానా హీరో/హీరోయిన్ ను ఇష్టపడుతున్నాను లేదా ఆమెతో/అతడితో కలిసి నటించాలనుకొంటున్నాను అని చెప్పేవారు చాలా తక్కువగా ఉంటారు. కానీ.. నేను ఆ హీరో/హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాను అని హాలీవుడ్ లో తప్ప మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పబ్లిక్ గా చెప్పుకొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అయితే.. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ మాత్రం అందుకు మినహాయింపు. ప్రస్తుతం “సాహో”లో ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్ తో గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు/దర్శకుడు/సింగర్ ఇంకా చాలా టాలెంట్స్ ఉన్న ఫర్హాన్ తో లివ్ ఇన్ రిలేషన్ తో ఉన్న విషయం మన టాలీవుడ్ జనాలకి పెద్దగా తెలీదు కానీ.. బాలీవుడ్ జనాలందరికీ తెలిసిన విషయమే.
ఇంతకీ ఇప్పుడు మేటర్ ఏంటంటే.. గత కొన్నేళ్లుగా తనతో రిలేషన్ లో ఉన్న శ్రద్ధాకపూర్ తో కలిసి ఒక సినిమాలో నటించమని అడిగాడట ఓ దర్శకుడు. అయితే.. అప్పటికే శ్రద్ధతో కలిసి “రాక్ ఆన్” అనే సినిమాలో నటించిన ఫర్హాన్.. ఆ సినిమా రిజల్ట్ తోపాటు శ్రద్ధతో ఉన్న రిలేషన్ ను దృష్టిలో ఉంచుకొని సింపుల్ గా నో చెప్పాడట.