అభిమాన కథానాయిక తమ ముందుకు వస్తే… సంతకాలు అడిగేవారు ఒకప్పుడు. ఏకంగా గుండెల మీదే సంతకాలు పెట్టించుకున్న వాళ్లను గతంలో మనం కొంతమందిని చూశాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోయిన్ కనిపిస్తే చాలు సెల్ఫీ అనేస్తున్నారు. వాళ్లు కూడా అభిమానుల ముచ్చట తీర్చడానికి స్మైల్ అంటూ పోజిస్తున్నారు. అయితే అలా సెల్ఫీలకు పోజులివ్వడం తనకు ఏ మాత్రం నచ్చదు అంటోంది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’లో చిట్టిగా కనిపించింది సూపర్‌సక్సెస్ అందుకుంది ఫరియా అబ్దుల్లా.
ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలో ఆమె పాత్ర అప్పుడప్పుడు కనిపించినా… ఉన్నంతసేపు హుషారుగానే ఉంటుంది. దీంతో ఫరియా ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అభిమానులు ఫొటోలు దిగేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఆమె ఫొటోలకు, సెల్ఫీలకు ముందుకు రావడం లేదట. మరీ ఫోర్స్ చేసి అడిగితేనే ఎస్ అంటోందట. ఫ్యాన్స్‌తో ఫొటోలు అంటే నో చెబుతున్నారు ఎందుకు? అని అడిగితే ఆసక్తికర సమాధానమిచ్చింది ఫరియా. ఫరియా అబ్దుల్లా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది.
‘అభిమానులతో ఫొటోలు దిగడానికి… ఎందుకు ఇంట్రెస్ట్ చూపించరు?’ అని ఒక నెటిజన్ అడిగాడు. దానికి ఫరియా… మీ దృష్టిలో మీరు నన్ను మాత్రమే కలుస్తారు. కానీ నేను రోజుకు చాలా మంది అభిమానులను కలుస్తుంటాను. అందరితో ఫొటోలకు పోజులివ్వడం అసాధ్యం. అంతటి ఎనర్జీ నాకు ఉంటుందని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించింది ఫరియా. అంతేకాదు ఫొటోలు దిగడమంటే నాకు ఆసక్తి ఉండదు అని కూడా చెప్పింది ఫరియా. అయితే మీరు ఫ్యాన్ మీట్ పెట్టాలనుకుంటున్నారట నిజమేనా అని మరో అభిమాని అడిగారు.
దానికి ఫరియా అవును ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడైతే ఆన్లైన్ ఫ్యాన్స్ మీట్ పెడదాం అనుకుంటున్నాను. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే… అందరం బయట కలుద్దాం అని చెప్పింది ఫరియా. ఇదంతా ఓకే మరప్పుడు ఫొటోలు అడిగితే ఏం చేస్తుందో మరి. ‘జాతి రత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ స్టేజీ ఆర్టిస్ట్… ఆ తర్వాత సరైన అవకాశం దక్కించుకోలేకపోయింది. ఒకటి, రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి అంటున్నారు. రవితేజ సినిమా ఒకటి ఓకే అయ్యిందని వార్తలొచ్చాయి. అయితే ఈలోపు నాగార్జున – నాగచైతన్య ‘బంగార్రాజు’ సినిమాలో ప్రత్యేక గీతంలో మెరిసింది. మిగిలిన సినిమాల గురించి త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది అని చెబుతున్నారు.