ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!

‘పిల్లలకి ఆయుష్షు లేదంటే తల్లిదండ్రులు తట్టుకోలేరు’ ఈ మాట ‘మనం’ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు గారు చెబుతారు. నిజంగా అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని అంతా కోరుకుంటారు. అయితే ‘మానవుడు తలచేది ఒకటి.. దేవుడు శాసించేది ఒకటి’… ‘విధి రాతని ఎవ్వరూ మార్చలేరు’ అనే విధంగా జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ప్రస్తుతం మనం సినీ పరిశ్రమలోని కొంతమంది సినీనటుల గురించి మాత్రమే మాట్లాడుకుందాం.

వాళ్ళకి కలిగిన పుత్ర శోఖాల గురించి తెలిస్తే ఎంతటి కఠిన హృదయులు అయినా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. ఈ మధ్యనే ఘట్టమనేని రమేష్ బాబు గారు చనిపోయారు. ఆయన అంత్యక్రియల సమయంలో ఆయన తండ్రి కృష్ణగారు కన్నీటి పర్యవంతం అయ్యారు. ఆ విజువల్స్ తొందరగా మైండ్లో నుండీ పోవు. కృష్ణ గారు మాత్రమే కాదు గతంలో చాలా మంది సినీ నటులకి ఈ పుత్రశోకం అనేది తప్పలేదు. ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) నందమూరి తారక రామారావు :

ఎన్టీఆర్ పెద్ద కొడుకు అయిన నందమూరి రామకృష్ణ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించారు.

2) నందమూరి హరికృష్ణ :

ఎన్టీఆర్ కొడుకు అయిన నందమూరి హరికృష్ణ గారి కుమారుడు నందమూరి జానకీ రామ్ గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. తర్వాత కొన్నాళ్ళకి హరికృష్ణ గారు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.

3) గొల్లపూడి మారుతీ రావు :

ప్రముఖ రచయిత, నటుడు అయిన గొల్లపూడి మారుతి రావు గారి కొడుకు శ్రీనివాస్ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ప్రమాదానికి గురై మరణించారు. వైజాగ్ బీచ్ లో బైక్ నడుపుతూ ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఆయన సముద్రంలో పడి మృతి చెందారు.

4) పరుచూరి వెంకటేశ్వరరావు :

ప్రముఖ రచయిత, నటుడు అయిన పరుచూరి వెంకటేశ్వరరావు గారి తనయుడు పరుచూరి రఘుబాబు కూడా అనారోగ్యం పాలవ్వడంతో మరణించారు.

5) కోట శ్రీనివాసరావు :

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి కొడుకు కోట ప్రసాద్.. రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో మరణించారు.

6) బాబు మోహన్ :

సీనియర్ స్టార్ కమెడియన్ బాబు మోహన్ కొడుకు పవన్ కుమార్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

7) ప్రభుదేవా :

ప్రముఖ నటుడు, దర్శకుడు,స్టార్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా కూడా తన కొడుకుని పోగొట్టుకున్నాడు. చిన్న వయసులోనే అతను మరణించాడు.

8) తేజ :

దర్శకుడు తేజ కూడా తన కొడుకుని పోగొట్టుకున్నాడు. అనారోగ్యం పాలైన తన కొడుకు చిన్న వయసులోనే ప్రాణాలు విడిచాడు.

9) ప్రకాష్ రాజ్ :

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన కొడుకుని పోగొట్టుకున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగా ప్రకాష్ రాజ్ కొడుకు మరణించినట్టు తెలుస్తుంది.

10) కృష్ణ :

సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు కూడా అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

Share.