భజన చేయకపోతే భవిష్యత్ ఉండదా?

  • July 17, 2020 / 06:50 PM IST

ఎక్కడనైనా మనం ఎదగాలంటే లౌక్యం అవసరం. ముక్కుసూటిగా మాట్లాడేవారు ఎవరికీ నచ్చరు. ఆ స్వభావం కలిగిన వారు కెరీర్ లో ఎదగడం కూడా కష్టమే. ముఖస్తుతి చేసే వారు జనాలకు బాగా దగ్గరవుతారు. అందలం ఎక్కడానికి పైవారికి కొంచెం భజన చేస్తూ భవిష్యత్ నిర్మించుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఇది చాలా అవసరం, అవసరాన్ని బట్టి దర్శకుడు హీరోని, హీరో నిర్మాతను, నిర్మాత దర్శకుడిని పొగిడేస్తుంటారు. సినిమా వేడుకలలో, వేదికలపై ఇది సహజంగా కనిపించే ప్రక్రియ.

ఎవరు ఎవరిని పొగిడారన్నది ఇక్కడ వాళ్ళ అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవకాశాలు లేక పొతే హీరో దర్శక నిర్మాతలు పొగిడేస్తారు. అదే ఒక ఫార్మ్ లో ఉన్న హీరో డేట్స్ కోసం దర్శక నిర్మాతలు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఎదో అవసరం కోసమే ఈ పొగడ్త అని వారికి తెలిసినా…దాని మాయలో పడి వరాలు ఇస్తూ ఉంటారు. ఇక వర్ధమాన హీరోలకు ఇది చాలా అవసరం. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో ఎదగాలంటే చిరంజీవి కుంటుబానికో లేదా నందమూరి కుటుంబానికో విధేయుడై ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా వారిని పొగడ్తలతో ముంచేయాలి.

అది వారి కెరీర్ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏళ్లుగా జరుగుతున్న ప్రక్రియే. ప్రతి ఒక యంగ్ హీరో మరియు హీరోయిన్ లేక నటుడు లేక కమెడియన్ ని ‘మీకు ఇష్టమైన హీరో ఎవరంటే’ చెప్పే మాట చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ . దాదాపు మెగా హీరోల ఒకరిని నుండే వారి ఫేవరేట్ గా చెవుతారు. వారిలో మనస్ఫూర్తిగా చెప్పినవారు కొందరే ఉంటారు. మిగతా వారంతా కేవలం అవసరం కోసమే. ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్న ఇదే నిజం.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus