ఇప్పటివరకు మలయాళ సినిమాల మార్కెట్ పరిమిత నెంబర్లతోనే కనిపించింది. కానీ ఎల్2ఇ: ఎంపురాన్ (L2: Empuraan) ఈ పరిమితులను చెరిపేసేలా దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో, మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం తొలి షోకే ముందే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌ను దాటి కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇది మలయాళ సినిమాల హిస్టరీలో సరికొత్త అధ్యాయం. మాలివుడ్ ఇంతవరకు సాధించిన బెస్ట్ ఓపెనింగ్ ‘మరక్కార్’, ‘కుంజలిమాల్’ వంటి సినిమాల ద్వారా వచ్చిన 20 కోట్ల గ్రాస్.
కానీ ఎంపురాన్ రిలీజ్‌కు ముందు టికెట్ ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే రూ.50 కోట్లు దాటుతోంది. ఇది మలయాళ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పూర్తిగా మార్చేసే డెవలప్‌మెంట్. ప్రీ బుకింగ్స్‌లో బుక్ మై షో 24 గంటల్లో 6.3 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని స్పష్టంగా చెప్పేస్తోంది.బాలీవుడ్‌లో చెన్నై ఎక్స్‌ప్రెస్, టాలీవుడ్‌లో బాహుబలి (Baahubali) , కోలీవుడ్‌లో కబాలి (Kabali), కన్నడలో కెజీఎఫ్ 2 (KGF 2) లు.. ఆయా ఇండస్ట్రీలో మొట్టమొదటి సారి 50 కోట్లు అందుకున్న సినిమాలు.
ఇక వాటి రేంజ్ లోనే ఎంపురాన్ స్కేల్ ఎంత మాస్‌గా ఉందో అర్థమవుతుంది. మలయాళ సినిమా హిస్టరీలో ఇది ఒక వినూత్న మలుపు. ఇందుకు గల కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోహన్‌లాల్ లాంటి లెజెండరీ హీరో, పృథ్వీరాజ్ లాంటి ప్రతిభావంతుడు దర్శకత్వం వహించడం, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విడుదల ప్రణాళిక – ఇవన్నీ కలిసే ఈ హైప్‌ను తెచ్చాయి. ఎంపురాన్ (L2 Empuraan) మునుపటి భాగం ‘లూసిఫర్’కు ఉన్న క్రేజ్‌తో పాటు, ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేయడం వర్కౌట్ అయ్యింది.
ఇది కేవలం మలయాళం సినిమా కాకుండా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అవుతుండటం, అన్ని ప్రాంతాల్లో భారీ థియేటర్లలో విడుదల కావడం.. ఈ ఫ్యాక్టర్లు అన్ని కలసి పాన్ ఇండియా మూవీలా ఈ సినిమాకు రూపాన్నిచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు (Dil Raju) విడుదల చేయడంతో అక్కడి మార్కెట్లోనూ భారీ వసూళ్లు ఆశిస్తున్నారు. ఈ ఓపెనింగ్ బిజినెస్ చూస్తుంటే, ఎంపురాన్ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమకు ఒక టర్నింగ్ పాయింట్ గా నిలవబోతోంది.