లేటు వయసులో పెళ్లి.. వెకేషన్లు.. భార్యతో నటుడి రొమాంటిక్ ఫోటోలు వైరల్!

ప్రేమ,బ్రేకప్, పెళ్లి, విడాకులు.. ఇలాంటి వ్యవహారాలు ఇప్పట్లో చాలా కామన్ అయిపోయాయి. కానీ ఇవి ఎక్కువగా సినీ పరిశ్రమలో మాత్రమే జరుగుతాయి అనే అపోహ కొందరిలో ఉంది. గ్లామర్ ఇండస్ట్రీ, పైగా జనాలు ఎక్కువగా దృష్టి పెట్టే ఇండస్ట్రీ కాబట్టి.. సినిమా వాళ్లే అలా చేస్తారు అనడం కరెక్ట్ కాదు. ఇవి అన్ని రంగాల్లో కామన్. కాకపోతే సినిమా పరిశ్రమ హైలెట్ అవుతూ ఉంటుంది. సామాన్యులు కూడా ఇప్పుడు ఎక్కువగా విడాకుల బాట పడుతున్నారు.

Ashish Vidyarthi

కానీ సెలబ్రిటీలకు చెందిన వార్తలే ఎక్కువ వైరల్ అవుతాయి. అవి మాత్రమే ప్రజలకి తెలుస్తాయి. సరే ఈ క్లాసులు పక్కన పెట్టేసి అసలు విషయానికి వచ్చేద్దాం. ఓ సీనియర్ నటుడు 60 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాడు.. అని అతనిపై ఘోరమైన ట్రోలింగ్ జరిపారు నెటిజన్లు. అతను మరెవరో కాదు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) . విలన్ గా, విలక్షణ నటుడిగా ఇతను ఫేమస్. నార్త్ కి చెందిన నటుడు అయినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన సినిమాల్లో కూడా నటించాడు.

ఇతని వ్యక్తిగత జీవితం చాలా మందికి సుపరిచితమే. 2001లో ఇతను పిలు విద్యార్థి అలియాస్ రాజోషి అనే వ్యక్తిని పెళ్లాడాడు. కొన్నాళ్ళు ఈ జంట బాగానే కలిసున్నారు కానీ.. తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2022 లో వీళ్ళు అధికారికంగా విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోవడం జరిగింది. అయితే తర్వాత అంటే 2023 లో అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెనర్ అయినటువంటి రూపాలి బారువాను కోల్‌కతా క్లబ్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు ఆశిష్ విద్యార్ధి.

అప్పటికి అతని వయసు 60 ఏళ్ళు, ఆమె వయసు 50 ఏళ్ళు. లేటు వయసులో ఆశిష్ రెండో పెళ్లి చేసుకోవడంపై అతన్ని చాలా మంది నెటిజన్లు విమర్శించారు. అయితే ‘చట్టపరంగానే నేను రెండో వివాహం చేసుకున్నాను. చివరి రోజుల్లో ఒక తోడు, సంతోషంగా జీవితాన్ని ముగించాలి అనే ఉద్దేశంతో రెండో పెళ్లి చేసుకున్నాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇతని రెండో భార్యతో వెకేషన్ కి వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గురూజీ అంటే వెంకీకి ఎందుకంత భయం?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus