Kriti Shetty: ఫస్ట్ టైం అలాంటి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కృతి శెట్టి!

  • September 9, 2022 / 04:56 PM IST

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ వరుసగా మరో రెండు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్న బేబమ్మ దూకుడికి బ్రేకులు పడినట్టు తెలుస్తుంది. తాజాగా ఈమె లింగు స్వామి దర్శకత్వంలో నటించిన దివారియర్ సినిమా పెద్దగా ఫలితాలను అందుకోలేదు. రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.

ఈ సినిమాతో మొదటిసారి ప్లాప్ అందుకున్న ఈమె అనంతరం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో మరొకటి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకుంది.ఇలా వరుస రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమె కెరియర్ ఇబ్బందులలో పడిందని చెప్పాలి. ఇకపోతే ఇదివరకే ఈమె వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరోసారి నాగచైతన్యతో జోడి కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటివరకు కృతి శెట్టి ప్రేమ కథ చిత్రాలలో నటించిన విషయం మనకు తెలిసిందే అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర ఎంతో భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మొదటిసారి ఒక ప్రేతాత్మ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో ఎంతో అందంగా క్యూట్ గా కనిపించిన

ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో మాత్రం ప్రేతాత్మ పాత్రలో నటిస్తూ అందరిని భయపెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి ద్విపాత్రాభినయంలో నటిస్తుందని ఒక పాత్ర ప్రేతాత్మ గాను మరొక పాత్రలో నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో కృతి శెట్టి డేరింగ్ స్టెప్ వేస్తూ డిఫరెంట్ రోల్ లో కనిపించడానికి సిద్ధమైందని తెలుస్తుంది. మరి ఈ సినిమా అయినా తనని కాపాడుతుందో లేదో వేచి చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus