యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి బిగినింగ్ ద్వారా జాతీయ నటుడిగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ రెండు సినిమాలకు ప్రభాస్ కండలు తిరిగిన బాడీని కలిగి ఉండాలి. ఇందు కోసం ప్రభాస్ నిపుణుల సమక్షంలో ఆహారాన్ని తీసుకుంటున్నారు. అలాగే జిమ్ చేస్తున్నారు. డైటింగ్ బోర్ కొట్టి షూటింగ్ లేని రోజుల్లో ఎవరికీ తెలియకుండా తన ఫేవరెట్ ఐస్ క్ర్రీం ఫ్రూట్ ఎక్సోటిక ను బకెట్ తిన్నట్లు ప్రభాస్ తెలిపారు. అయితే ఐస్ క్ర్రీం తిన్న తర్వాత కేలరీలు కరిగే వరకు ఎక్కువ సేపు వ్యాయామం చేస్తానని వెల్లడించారు.
కొంత విరామం తర్వాత జక్కన్న యస్. యస్. రాజమౌళి బృందం బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ మొదలెట్టింది. ఈ షూటింగ్ కి విదేశాల్లో టూర్ ముగించుకుని ప్రభాస్ హాజరయ్యారు. 15 నిముషాల నిడివిగల క్లైమాక్స్ షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో చిత్ర యూనిట్ శ్రమిస్తోంది.