మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించే సినిమా ఏదనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చిరంజీవికి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల జాబితా ఎక్కువగానే ఉంది. అయితే కథ పూర్తిస్థాయిలో మెప్పించకపోవడం వల్లే చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదని తెలుస్తోంది. కథలు కుదిరితే మాత్రం చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడానికి ఎంతో సమయం పట్టదని తెలుస్తోంది.
హరీష్ శంకర్, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్, వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణ చిరంజీవితో పని చేయాలని ఆసక్తి చూపిస్తున్న దర్శకుల జాబితాలో ఉన్నారు. చిరంజీవి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి పారితోషికం కూడా 100 కోట్ల రూపాయలకు చేరిందని వార్తలు వినిపిస్తుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
చిరంజీవి ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. చిరంజీవి మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ చిరంజీవి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఆరు పదుల వయస్సులో కూడా గ్రేస్ తో, ఎనర్జీతో ఆఫర్లను అందుకుంటున్నారు. భోళా శంకర్ సినిమాతో చిరంజీవి హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యంగ్ జనరేషన్ లో కూడా చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువ కాదు. చిరంజీవి కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఇష్టపడుతున్నారు. చిరంజీవి బాలీవుడ్ మార్కెట్ ను పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో చిరంజీవి బిజీ కావడంతో పాటు విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?