OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

తినబోతూ రుచులేందుకు అని పెద్దవాళ్ళు అంటారు. కానీ సినిమాల విషయంలో అలాంటిది పని చేయదు. ‘అతడు’ స్టైల్లో ఏదో ఒకటి ‘కనిపించి కనిపించకుండా.. చూపించి చూపించకుండా’ ఊరిస్తేనే సినిమాపై బజ్ మరింతగా పెరుగుతుంది అని మేకర్స్ అనుకుంటారు. అందుకే షోలు పడే కొన్ని గంటల ముందు కూడా సినిమాకి సంబంధించి ఏదో ఒక స్టఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసి జనాలు ‘కచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోవాలి’ అనేలా చేస్తుంటారు. ‘ఓజి’ విషయంలో కూడా నిర్మాణ సంస్థ ఇదే స్ట్రాటజీని.. కాదు కాదు అంతకు మించిన స్ట్రాటజీని ఫాలో అవుతుంది.

OG

ప్రొడక్షన్ హ్యాండిల్ అనే హద్దులు చెరిపేసి ఓ మీమ్ పేజీ మాదిరి మారిపోయింది అనే చెప్పాలి. ఈ క్రమంలో ‘ఓజి’ కి సంబంధించి గంటకో ఫోటో షేర్ చేస్తూ బజ్ పెంచుకుంటూ పోతుంది.ఇదిలా ఉండగా… ‘ఓజి’ సినిమాలోని కొన్ని అంశాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి డిజిటల్ పేజెస్ కి ప్రొడక్షన్ హౌస్ కావాలనే ఆ పాయింట్స్ ఇచ్చి హైప్ పెంచుతున్నారో ఏమో.. అందులో కొన్ని అయితే అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. అవేంటంటే.. ‘ఓజి’లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఎపిసోడ్ కోసం అకీరా నందన్ పని చేశాడట. కానీ అది సినిమాలో కాదు.. గేమ్ కోసం అని కొందరు అంటున్నారు.

మరోపక్క ఈ సినిమాలో ‘సాహో’ యూనివర్స్ ను కూడా సుజిత్ లింక్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి.. ప్రభాస్ కూడా ఓ సీన్లో కనిపిస్తాడట.అలాగే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ వద్ద వచ్చే యాక్షన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ కూడా అదిరిపోతుంది అంటున్నారు. ఇక క్లైమాక్స్ అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా ‘ఓజి’ లో అదిరిపోయే 4 యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా సుజిత్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత వరకు నిజముందో..!

 ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus