Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

‘ఓజి’ సినిమాకి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. దీంతో ఈరోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ‘ఓజి’ సినిమాకి ప్రీమియర్ షోలు, టికెట్ హైకుల కోసం అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంది ‘ఓజి’ యూనిట్. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి.. ఆమోదం తెలుపుతూ జీవో పాస్ చేసింది. దీంతో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వంటివి ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఆ మెమోను సవాలు చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Og Premieres

టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడానికి హోమ్ శాఖకు సంబంధం ఏంటి? అంటూ అతను పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. హోంశాఖ, స్పెషల్ సీఎస్ కి ఎలాంటి సంబంధాలు లేవని అతను గుర్తుచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన మెమోను కూడా హైకోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ‘ఓజి’ టికెట్ రేట్లు అలాగే.. స్పెషల్ షోలపై సందిగ్ధం నెలకొంది.

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఓజి’ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్లిమ్ప్స్ తో ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరే లెవెల్. ట్రైలర్, పాటలు వంటివి కూడా హైప్ ను పెంచాయి. దీంతో ‘ఓజి’ సినిమాకి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రీమియర్ షోలకు భారీ రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్నాయి. టికెట్ రేటు రూ.2000 రూ.3000 వరకు పలుకుతుంది.

‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus