Prabhas: పాన్ ఇండియా మాస్ అంటున్న ట్రిపులార్ నిర్మాత…

  • November 5, 2022 / 05:44 PM IST

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అనౌన్స్ చేసినప్పటినుండే అంచనాలు ఆకాశాన్నంటుతాయి.. అలాంటి ఓ సాలిడ్ అండ్ కిరాక్ కాంబో గురించి ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.. రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఏమో కానీ కొత్తవి కమిట్ అవుతూనే ఉన్నాడు. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ వేసవికి వాయిదా పడిందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగాతో చెయ్యబోయే ‘స్పిరిట్’ సంగతేంటో తెలియాలి. ఇంతలో డైరెక్టర్ మారుతితో ఓ మూవీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, సడెన్‌గా సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ ఇచ్చాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది.. తక్కవ టైంలోనే గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.. హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది.. అలాగే ట్రిపులార్ నిర్మాత డి.వి.వి. దానయ్య దగ్గర డార్లింగ్ డేట్స్ ఉన్నాయి. మారుతి సినిమా ఆయనే ప్రొడ్యూస్ చెయ్యాల్సిందట.. కట్ చేస్తే ప్రభాస్ కోసం ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుని లైన్‌లో పెట్టాడట దానయ్య.. ప్రభాస్, బోయపాటి అంటే కిరాక్ కాంబినేషన్..

‘అఖండ’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీను, రామ్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రభాస్ గ్లోబల్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, ఓ సాలిడ్ అండ్ యునిక్ కాన్సెప్టుతో ప్రెస్టీజియస్ ఫిలింగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.. బోయపాటి మాస్ మేకింగ్‌కి, పాన్ ఇండియా స్టార్ క్రేజ్, కటౌట్ యాడ్ అయితే కనుక దాని ఇంపాక్ట్ ఇంకోలా ఉంటుంది అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus