శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

సినీ పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ టైం కేవలం 4,5 సంవత్సరాలే ఉంటుంది అని ఇండస్ట్రీ పెద్దలు అంటూ ఉంటారు. వాళ్ళు ఎంత సంపాదించుకున్నా ఈ టైంలోనే సంపాదించుకోవాలి. ఎప్పుడైతే వారికి ఆఫర్లు తక్కువయ్యాయో అప్పుడు ఇక పెళ్లి చేసుకోవడమే బెటర్. చాలా మంది హీరోయిన్లు ఫాలో అయ్యేది కూడా అదే..! అయితే కొంత మంది హీరోయిన్లు పెళ్ళైన తర్వాత కూడా సినిమాల్లోనే నటించాలి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి చెందిన నటీనటులను, నిర్మాతలు లేదా దర్శకులను పెళ్ళాడతారు. మరికొంతమంది అయితే సేఫ్టీ చూసుకుని బిజినెస్మెన్ లను పెళ్లాడతారు. అయితే అందరి హీరోయిన్లకు బిజినెస్ మెన్లు దొరకరు కదా..! అలా బిజినెస్మెన్లను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1)శిల్పా శెట్టి :

సాహస వీరుడు సాగర కన్య, వీడెవడండీ బాబు, భలే వాడివి బాసు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శిల్పాశెట్టి ప్రముఖ బిజినెస్మెన్ రాజ్ కుంద్రా ను పెళ్లి చేసుకుంది.

2) ఇషా కొప్పికర్ :

చంద్రలేఖ, కేశవ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఇషా కొప్పికర్ ముంబైలో ఎన్నో హోటల్స్ కు అధిపతి అయిన టిమ్మీ నారంగ్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది.

3) ఆసిన్ :

‘గజిని’ ‘ఘర్షణ’ ‘చక్రం’ ‘శివ మణి’ ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘లక్ష్మీ నరసింహ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆసిన్ మైక్రోమాక్స్ సంస్థ సీఈవో అయిన రాహుల్ శర్మ ని పెళ్లాడింది.

4) రీమా సేన్ :

‘చిత్రం’ ‘మనసంతా నువ్వే’ ‘బంగారం’ ‘వీడే’ ‘చెలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె రెస్టారెంట్ బిజినెస్ చేసే శివ్ కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకుంది.

5) అయేషా టకియా :

సూపర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అయేషా టకియా హోటల్ బిజినెస్ రంగానికి చెందిన, పొలిటీషియన్ అబూ అజ్మీ కొడుకు అయిన ఫర్హాన్ అజ్మీ ని పెళ్లి చేసుకుంది.

6) ప్రియమణి :

పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు, రగడ, శంభో శివ శంభో, ద్రోణ, నారప్ప వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజింగ్ బిజినెస్ చేసే ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది.

7) పూర్ణ :

‘అవును'(సిరీస్) ‘సీమటపాకాయ్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పూర్ణ.. దుబాయ్ బేస్డ్ బిజినెస్ మెన్ షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంది.

8) నదియా :

ఒకప్పటి హీరోయిన్ నదియా ఇప్పుడు ‘మిర్చి’ ‘అత్తారింటికి దారేది’ ‘బ్రూస్ లీ’ ‘నా పేరు సూర్య..’ వంటి చిత్రాల్లో తల్లి వదిన అత్త పాత్రలు చేస్తుంది. ఈమె ప్రముఖ బిజినెస్మెన్ శిరీష్ గాడ్ బోలె ను పెళ్లి చేసుకుంది.

9) కాజల్ అగర్వాల్ :

తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లు ని పెళ్లాడింది కాజల్ అగర్వాల్.

10) హన్సిక :

హన్సిక కూడా బిజినెస్ మెన్ సొహెల్ కతూరియాని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus