Bomma Blockbuster Review: బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నందు (Hero)
  • రష్మి గౌతమ్ (Heroine)
  • రఘు కుంచే తదితరులు.. (Cast)
  • రాజ్ విరాట్ (Director)
  • ప్రవీణ్ పగడాల - బోసుబాబు నిడుమోలు - ఆనంద్ రెడ్డి మడ్డి - మనోహర్ రెడ్డి (Producer)
  • ప్రశాంత్ ఆర్.విహారి (Music)
  • సుజాత సిద్ధార్ధ్ (Cinematography)
  • Release Date : నవంబర్ 04, 2022

యాంకర్ రష్మి మార్కెట్ & పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన మరో చిన్న సినిమా “బొమ్మ బ్లాక్ బస్టర్”. నందు హీరోగా నటించిన ఈ చిత్రం గత రెండేళ్లు పురిటి నొప్పులు పడుతూ ఎట్టకేలకు నేడు (నవంబర్ 04) విడుదలైంది. మరి బొమ్మ నిజంగా బ్లాక్ బస్టరో కాదో చూద్దాం..!!

కథ: పూరీ జగన్నాధ్ కు ఏకలవ్య శిష్యుడు పోతురాజు (నందు), తన జీవితంలో చోటు చేసుకున్న విషయాలతో సినిమా తీసి.. సూపర్ హిట్ కొట్టి డైరెక్టర్ గా సెటిల్ అయిపోవాలని పగటి కలలు కంటూ ఉంటాడు. అంతా సెట్ అవుతుంది అనుకునే సమయంలో పోతురాజు తండ్రి హత్య చేయబడతాడు.

అసలు పోతురాజు తండ్రిని చంపింది ఎవరు? ఈ హత్య కారణంగా పోతురాజు జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఎలాంటివి? అనేది “బొమ్మ బ్లాక్ బస్టర్” కథాంశం.

నటీనటుల పనితీరు: నందు యాస సినిమాకి మంచి ప్లస్ పాయింట్. నటుడిగానూ పర్వాలేదనిపించుకున్నాడు. కాకపోతే.. బాడీ లాంగ్వేజ్ విషయంలో మాత్రం వేరే హీరోలను ఇమిటేట్ చేసినట్లుగా ఉండడం మైనస్. రష్మీకి ఎప్పట్లానే నటించే స్కోప్ కానీ పాత్ర కానీ దొరకలేదు. కానీ.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం చూడముచ్చటగా ఉంది.

రష్మీ అంగాంగ ప్రదర్శన కాక ఆమె హావభాలను ఎలివేట్ చేసిన మొదటి సినిమా ఇదేనేమో. కిరీటి, రఘు కుంచెల పాత్రల విషయంలో క్లారిటీ లేకపోవడంతో వాళ్ళు పండించే కామెడీ లేదా విలనిజం అనేది సరిగా ఎలివేట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: అసలు సినిమాను ఏ జోనర్ లో తీయాలో తెలియక.. ఒక నాలుగైదు జోనర్లు మిక్స్ చేసి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు రాజ్ విరాట్. యాక్షన్ సినిమా ఏమో అనుకునే తరుణంలో ఎమోషనల్ ఫీల్ తో సాగదీశాడు. చివరికి ఎటూ తేల్చకుండా వదిలేశాడు. అందువల్ల సినిమా జోనర్ ఏమిటి? అసలు కథ ఏమిటి? అనేది ఎవరికీ క్లారిటీ లేకుండాపోయింది. టెక్నికల్ గా మాత్రం మంచి మేకింగ్ తో అలరించాడు. అయితే.. సినిమాకి టెక్నికాలిటీస్ కంటే కథనం చాలా ముఖ్యమనే విషయాన్ని విస్మరించినట్లున్నాడు.

సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్ధ్, ఎడిటింగ్ వంటివన్నీ బాగున్నాయి. అయితే.. సరైన కథ-కథనం లేకపోవడం వల్ల ఈ టెక్నికాలిటీస్ & టెక్నీషియన్స్ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది.

విశ్లేషణ: టైటిల్ జస్టిఫికేషన్ చేసుకోవడంలో విఫలమై.. ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసి.. టెక్నీషియన్స్ కష్టాన్ని వృధా చేసిన సినిమా “బొమ్మ బ్లాక్ బస్టర్”.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus