Urvasivo Rakshasivo Review: ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 4, 2022 / 04:07 PM IST

Cast & Crew

  • అల్లు శిరీష్ (Hero)
  • అను ఇమ్మాన్యూల్ (Heroine)
  • వెన్నెల కిషోర్ (Cast)
  • రాకేష్ శశి (Director)
  • ధీరజ్ మొగిలినేని - విజయ్ ఎం (Producer)
  • అచ్చు రాజమని - అనూప్ రూబెన్స్ (Music)
  • తన్వీర్ మీర్ (Cinematography)

తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న “ప్యార్ ప్రేమ కాదల్”కు రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన చిత్రం “ఊర్వశివో రాక్షశివో”. తొలుత ఈ చిత్రానికి “ప్రేమ కాదంట” అని టైటిల్ పెట్టి గతేడాదే ఫస్ట్ లుక్ ను రివీల్ చేసినా.. థియేటరికల్ రిలీజ్ కు నోచుకోవడానికి దాదాపు మరో ఏడాది పట్టింది. మరి అల్లు శిరీష్ ఈ సినిమాతోనైనా కథానాయకుడిగా, నటుడిగా నిలదొక్కుకోగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: ఒక మిడిల్ క్లాస్ యువకుడు శ్రీ (అల్లు శిరీష్). మంచి హైక్లాస్ & ఆధునిక యువతి సింధూజ (అను ఇమ్మాన్యుల్). ఆఫీస్ కోలీగ్స్ ల మొదలైన వీరి ప్రయాణం పడక గది దాకా వెళ్తుంది. అక్కడ్నుంచి పెళ్లి పీటలకు తీసుకెళదామని శ్రీ చేసే ప్రయత్నం దారుణంగా బెడిసికొడుతుంది. ఏంటీ కారణం? శ్రీ-సింధుల ప్రేమ పెళ్లి వరకూ వెళ్లకపోవడానికి కారణం ఏమిటి? అనేది “ఊర్వశివో రాక్షశివో” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: అల్లు శిరీష్ చాన్నాళ్ల తర్వాత తనకు తగ్గ పాత్రలో నటించాడు. చలాకీ మిడిల్ క్లాస్ యువకుడిగా శిరీష్ నటన బాగుంది. అతడి క్యారెక్టరైజేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అను ఇమ్మాన్యూల్ నటిగా కంటే గ్లామర్ తో ఎక్కువగా ఆకట్టుకుంది. శిరీష్-అనుల కెమిస్ట్రీ బాగుంది. వారి మధ్య రొమాంటిక్ ఎపిసోడ్స్ & కామెడీ బాగా వర్కవుటయ్యింది.

వెన్నెల కిషోర్ పంచులకు థియేటర్ మొత్తం నవ్వులతో ఊగింది. ఆమని & కేదార్ శంకర్ ల పాత్రలు బాగున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు: “జత కలిసే, విజేత” చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ శశి.. “ఊర్వశివో రాక్షశివో”ను డీల్ చేసిన విధానం బాగుంది. తమిళ చిత్ర కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మలుచుకొని.. కామెడీ ట్రాక్ ను చక్కగా ప్లేస్ చేసిన విధానం బాగుంది. వెన్నెల కిషోర్ ను బాగా వాడుకున్నాడు. సెకండాఫ్ లో కాస్త తడబడ్డాడు కానీ.. ఓవరాల్ గా మాత్రం ఆకట్టుకున్నాడు. అచ్చురాజమని – అనూప్ రూబెన్స్ సంగీతం & నేపధ్య సంగీతం యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

విశ్లేషణ: ఈమధ్యకాలంలో ఈ తరహా యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాలేదు. అందువల్ల ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి అల్లు శిరీష్ హిట్ కొట్టాడండోయ్.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus