Like, Share & Subscribe Review: లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సంతోష్ శోభన్ (Hero)
  • ఫరియా అబ్దుల్లా (Heroine)
  • బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్ (Cast)
  • మేర్లపాక గాంధీ (Director)
  • వెంకట్ బోయనపల్లి (Producer)
  • ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల (Music)
  • ఎ వసంత్ (Cinematography)
  • Release Date : నవంబర్ 4th, 2022

స్వర్గీయ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం “లైక్ షేర్ & సబ్ స్క్రైబ్”. జాతిరత్నాలు ఫేమ్ ఫారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. టీజర్ & ట్రైలర్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, సరికొత్త తరహా ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్ళిన ఈ చిత్రం థియేటర్లలో వారిని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ: గువ్వ విహారి అనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి ఎప్పటికైనా టాప్ యూట్యూబర్ అయిపోవాలని కలలు కంటూ ఉంటాడు విప్లవ్ (సంతోష్ శోభన్). ఆ అత్యాశతోనే డానియల్స్ (సుదర్శన్)తో కలిసి అరకు బయలుదేరతాడు. అక్కడ తనను ఇన్స్పైర్ చేసిన యూట్యూబర్ వసుధ వర్మ (ఫారియా)ను కలుస్తాడు. ఆమెకు తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు.

కట్ చేస్తే.. ఊహించని విధంగా ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు. అసలు ఏమిటా సమస్య? ఆ సమస్య నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు? అనేది “లైక్ షేర్ సబ్ స్క్రైబ్” కథాంశం.

నటీనటుల పనితీరు: హీరోహీరోయిన్ సమానంగా ఆకట్టుకున్న సందర్భాలు అరుదు. ఈ చిత్రం విషయంలో అది జరిగింది. సంతోష్ శోభన్ & ఫారియా అబ్ధుల్లా తమ నటనతో విశేషమైన రీతిలో ఆకట్టుకున్నారు. సంతోష్ శోభన్ బాడీ లాంగ్వేజ్ లోని చురుకు, ఫారియా ముఖంలో అమాయకత్వం వారు పోషించిన పాత్రలను విశేషంగా ఎలివేట్ చేశాయి. మరీ ముఖ్యంగా వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యింది.

బ్రహ్మాజీ సీరియస్ పాత్రలో మంచి కామెడీ పండించాడు. సుదర్శన్ ఎప్పట్లానే యాసతో నెట్టుకొచ్చేశాడు. మిగతా నటులు కామెడీతో అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: వసంత్ ఫోటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అరకు అందాలను బాగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా నైట్ షాట్స్ ను విజువలైజ్ చేసిన విధానం బాగుంది. ఫ్రేమ్స్ కూడా కొత్తగా ట్రై చేశాడు.

ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల పాటలు పర్వాలేదు. నేపధ్య సంగీతం మాత్రం సినిమా మూడ్ కానీ ఎమోషన్స్ ను కానీ ఎలివేట్ చేయలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమా బడ్జెట్ కు తగ్గట్లుగా ఉన్నాయి.

ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఒక షార్ట్ ఫిలిమ్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించాలనుకోవడం పెద్ద మైనస్. ఫస్టాఫ్ కామెడీతో ఆకట్టుకున్నా.. సెకండాఫ్ కి వచ్చేసరికి కథనాన్ని ఎలా నడిపించాలో తెలియక తాను తికమక పడి ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టాడు. కామెడీ పంచ్ లు బాగానే ఉన్నాయి కానీ.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: లీడ్ పెయిర్ యాక్టింగ్ & కెమిస్ట్రీ, కామెడీ సీన్స్ వర్కవుటయినప్పటికీ.. కథలో విషయం లేకపోవడం, స్క్రీన్ ప్లేలో పస లేకపోవడంతో “లైక్ షేర్ & సబ్ స్క్రైబ్” బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇకనుంచైనా సంతోష్ శోభన్ కథలు కాస్త సీరియస్ గా వింటే సినిమాలు వర్కటవుతాయి.

రేటింగ్: 1.5/5

Click Here To Read In ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus