Geetu: వైరల్ అవుతున్న గలాటా గీతూ ఎమోషనల్ పోస్ట్!

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమేనేట్ కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేసి మంచి పని చేశారని కొంతమంది చెబుతుండగా ఎలిమినేట్ చేయడం ద్వారా బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గలాటా గీతూ లేని బిగ్ బాస్ షో ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాల్సి ఉంది.

అయితే గలాటా గీతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో జీవితంలో ఎప్పుడూ చూడని అందమైన జీవితాన్ని అనుభవించానని ఆమె కామెంట్లు చేశారు. అయితే అందులో నేను ఓడిపోయానని ఆమె పేర్కొన్నారు. మనుషుల విలువ తెలిసిందని నా తప్పులను క్షమించాలని ఆమె కోరారు. నన్ను నన్నుగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ చనిపోయే వరకు రుణపడి ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో నా ఆట ముగిసిందని ఆమె చెప్పుకొచ్చారు. గలాటా గీతూపై ప్రేక్షకుల్లో మొదట్లో నెగిటివ్ ఒపీనియన్ కలిగినా నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో మాత్రం ఆమె ఆకట్టుకున్నారు. టాప్5 లో గలాటా గీతూ ఉంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. గలాటా గీతూ ఎలిమినేషన్ తో ఇంతకాలం ఆమెను సపోర్ట్ చేస్తున్న వాళ్లు సైతం ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

గలాటా గీతూకు ఈ షో ద్వారా 2 లక్షల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షో వల్ల ఆమెకు కొత్త ఆఫర్లు దక్కే ఛాన్స్ అయితే ఉంది. కొత్త ఆఫర్ల విషయంలో గలాటా గీతూ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. కొన్ని విషయాల్లో మారితే గలాటా గీతూ కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus