Gali Kireeti: గాలి కిరీటి ఎంత రిస్క్‌ తీసుకున్నాడో చూశారా?

  • April 21, 2022 / 03:52 PM IST

ఓ రెండు వారాల క్రితం గాలి కిరీటి అనే హీరో ఇంట్రడక్షన్‌ అయ్యింది గుర్తుందా? అవును, గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడే కదా.. బాగా గుర్తు అంటారా! అలా అయితే ఇంట్రడక్షన్‌ కోసం విడుదల చేసిన వీడియో కూడా మీరు చూసే ఉంటారు. సుమారు 80 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో వైరల్‌ అయ్యింది కూడా. కిరీటికి ఏయే విభాగాల్లో ఎంత పట్టు ఉంది అనేది తెలిసేలా ఆ వీడియోను రూపొందించారు. డ్యాన్స్‌, యాక్షన్‌, నటనలో ప్రావీణ్యం చూపించేలా ఆ వీడియోను రూపొందించారు. ఇప్పుడు ఆ వీడియో మేకింగ్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

Click Here To Watch NOW

కొత్త వీడియో చూస్తే చిన్న వీడియో కోసం కిరీటి అంత పెద్ద రిస్క్‌ చేశాడా అని కచ్చితంగా అనిపిస్తుంది. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో ఈ వీడియోను తెరకెక్కించారు. ఫ్లిప్‌లు, డైవ్‌లు, స్కేట్‌ బోర్డ్‌ సీన్స్‌, జంప్‌లు… ఇలా అన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ఈ క్రమంలో కిరీటి పలుమార్లు కిందపడిపోవడం, దెబ్బలు తాకడం వీడియోలో చూడొచ్చు. అలాగే గ్లాస్‌ బ్రేక్‌ అయ్యి వేళ్లు కట్‌ అవ్వడం కూడా కనిపిస్తుంది.

సినిమా అంటే కిరీటికి ఎంత ఇష్టం అనేది ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది అని ప్రేక్షకులు, పరిశీలకులు అంటున్నారు. ఏదో హీరో అయిపోదాం అని వచ్చేసేలా కాకుండా నటన పరంగా శిక్షణ తీసుకొని, రిస్క్‌లకు వెనుకాడకుండా కిరీటి సినిమాల్లోకి వచ్చాడని చిత్రబృందం చెప్పకనే చెప్పింది అనొచ్చు కూడా. ఇంట్రడక్షన్‌ వీడియోలో చూస్తే స్కేట్‌ బోర్డును భలేగా హ్యాండిల్‌ చేస్తాడు. అలాగే కారు మీద నుండి బిడ్డతో దూకే సీన్‌ అయితే సూపర్‌.

టేబుల్‌ మీద ఫ్లిప్‌ అయ్యి… రోజ్‌ను ఇవ్వడంలో ఈజ్‌ కనిపిస్తుంది. ఆ తర్వాత వేసే స్టెప్పులు కూడా అదిరిపోతాయి. ఇప్పుడు మేకింగ్‌ వీడియోలో ఆ సీన్స్‌ అన్నీ చేయడానికి కిరీటి చేసిన ప్రాక్టిస్‌ కనిపిస్తుంది. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాత. ఇటీవల షూటింగ్‌ మొదలైన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోందట.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus