రాంచరణ్ (Ram Charan) , దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. మినిమమ్ థియేటర్స్ లో రన్ అవుతున్నప్పటికీ సినిమా బిలో యావరేజ్ షేర్స్ ను మాత్రమే రాబడుతుంది.
‘గేమ్ ఛేంజర్’ 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 19.29 cr |
సీడెడ్ | 10.44 cr |
ఉత్తరాంధ్ర | 10.42 cr |
ఈస్ట్ | 6.29 cr |
వెస్ట్ | 4.12 cr |
కృష్ణా | 5.32 cr |
గుంటూరు | 6.27 cr |
నెల్లూరు | 3.62 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 65.77 cr |
కర్ణాటక | 4.91 cr |
తమిళనాడు | 3.64 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 14.12 cr |
నార్త్ | 14.38 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 103.08 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.103.08 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.151.92 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.