మెగా పవర్ స్టార్ రాంచరణ్ నుండి సినిమా వచ్చి ఏడాదిన్నర దాటింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఆచార్య’ లో స్పెషల్ రోల్ చేశాడు చరణ్. అది పూర్తిగా చరణ్ సినిమా అనడానికి లేదు. మరోపక్క సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసి క భాయ్ కిసి క జాన్’ సినిమాలో చిన్న కేమియో ఇచ్చాడు. కానీ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన మూవీ ఇంకా రాలేదు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మొదలుపెట్టి రెండేళ్లు దాటింది.
ఇంకా 80 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది అని నిర్మాత దిల్ రాజు ఇటీవల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సింగపూర్లో ఓ షెడ్యూల్ జరిగింది. సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు టాక్. ఇది పక్కన పెడితే.. దర్శకుడు శంకర్ సినిమా అంటే టైం ఎక్కువ పడుతుంది. ఇది ఆనవాయితీగా కూడా వస్తుంది. అది కొత్త విషయం కాదు. సమస్య ఏంటి అంటే శంకర్ మరోపక్క ‘ఇండియన్ 2 ‘ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.
దానికి 3 వారాలు కేటాయిస్తే .. (Game Changer) ‘గేమ్ ఛేంజర్ ‘ కి వారం రోజులు కేటాయిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క చరణ్ కూడా కొత్త సినిమా మొదలు పెడదామా? అతనికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు శంకర్. గత 6 నెలల్లో 20 నిమిషాల ఫుటేజ్ ను మాత్రమే శంకర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆ ఛాన్స్ కనిపించడం లేదు. మార్చి నాటికి కానీ చరణ్ పార్ట్ కంప్లీట్ అవ్వదట. అతని పార్ట్ కంప్లీట్ అయ్యాక కూడా 50 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంటుందని ఇన్సైడ్ టాక్. అయితే చరణ్ మాత్రం తన పార్ట్ షూటింగ్ ను మార్చి నెలకి కంప్లీట్ చేయాలని శంకర్ కి గట్టిగా చెప్పినట్టు టాక్.