నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” కి గౌరవసూచకంగా గీతరచయిత సిరాశ్రీ, సంగీత దర్శకులు రవిశంకర్ సంయుక్తంగా రూపొందించిన ఒక గీతాన్ని నేడు విడుదల చేసారు.
“ఈ చిత్రం ప్రకటన వినగానే గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథసత్యనారాయణగారు వ్రాసిన “ఆంధ్రప్రశస్తి” చదివాను. వెంటనే పాట వ్రాయాలని స్ఫూర్తి కలిగింది. వ్రాసిన వెంటనే అదే స్ఫూర్తితో “కిల్లింగ్ వీరప్పన్”, “ఎటాక్” చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ అద్భుతంగా స్వరపరిచారు. గాయకుడు రోహిత్ ఎంతో అర్థవంతంగా పాడారు. ఈ పాటను కేవలం ఫ్యాన్ మేడ్ గా విడుదల చేసిందే తప్ప, దీనికి నందమూరి బాలకృష్ణ- దర్శకులు క్రిష్ గార్ల చిత్రానికి ఎటువంటి సంబంధమూ లేదు. రోమాంఛితమైన ఇంతటి గొప్ప చిత్రాన్ని తీస్తున్న దర్శకులు క్రిష్ గారికి, నటిస్తున్న బాలకృష్ణ గారికి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది”, అని గీతరచయిత సిరాశ్రీ తెలిపారు.
“ఈ పాట తొలినాటి తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణిని పరిచయం చేస్తుంది. చరిత్ర చెప్పినట్టు ఆయన గొప్ప యోధుడు కనుక ఈ పాటను ఆ పదంతోనే మొదలుపెట్టాము”, అని సంగీతదర్శకులు రవిశంకర్ తెలిపారు.
గీతరచన: “ఉదయలక్ష్మీపుత్ర” సిరాశ్రీ
సంగీతం: “శ్యామలాపుత్ర” రవిశంకర్
గానం: “సాయిసుధాపుత్ర” రోహిత్