రికార్డుల ప్రభంజనానికి రంగం సిద్దం!!!

టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ అంటే ఎవరైనా….ఇట్టే చెప్పే సమాధానం నందమూరు ఫ్యామిలీ….మెగా ఫ్యామిలీ. అయితే అదే క్రమంలో ఆ ఇరు ఫ్యామిలీస్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ చాలా బలంగా ఉంటుంది. అప్పట్లో బాలయ్య-చిరంజీవి మధ్య దాదాపుగా ఎన్నో సార్లు బాక్స్ ఆఫీస్ ఫైట్ జరిగింది.  అదంతా పక్కన పెడితే….ఇప్పుడు రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతున్న బాలయ్య 100వ చిత్రం గౌతామీ పుత్ర శాతకర్ణి మళ్లీ చిరు 150వ సినిమాను ఢీ కొడుతూ బరిలోకి దిగనుంది.

ఇదిలా ఉంటే దసరా సంధర్భంగా అటు బాలయ్య ఇటు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇద్దరు తమ సినిమాల టీజర్ ను అభిమానులకు అందించాలి అని ఆశగా ఎదురు చూస్తూ, పక్కా ప్లాన్ సిద్దం చేసుకున్నారు. అందులో భాగంగానే ముందుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ధృవ సినిమా టీజర్ ను అభిమానుల కోసం అందించనున్నాడు మన చెర్రీ…ఇక అదే క్రమంలో అటు బాలయ్య సైతం నందమూరి అభిమానులను ఎక్కడా నిరాశపరచకుండా టీజర్ను విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నాడు….ఇదిలా ఉంటే అనధికారిక వివరాల ప్రకారం ఇప్పటికే బాలయ్య శాతకర్ణి టీజర్ ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తుంది.

బాలయ్య సైతం ఆ టీజర్ లో చెప్పే డైలాగ్, ఆయన లుక్ వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాయి అని అభిమానాలు సంబరాలు చేసుకుంటున్నారు…ఇక మరో పక్క ఇప్పటికీ టాలీవుడ్ టాప్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ రెండిటికీ టీజర్ లు అతి కొద్ది గంటల వ్యవధిలోనే విడుదలవుతుండడం.. అది కూడా పండగ సెలవల్లో కావడంతో.. టీజర్ రికార్డులపై ఇప్పటికే ఫ్యాన్స్ కన్నేశారు. తమ హీరోల సినిమాల టీజర్ లు యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టేసేలా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు కూడా. అదీ లెక్క!!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus