శాతకర్ణి – వాశిష్ఠ దేవి ప్రణయ గీతం

  • September 19, 2016 / 10:36 AM IST

‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా ఈ సంక్రాతికి సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు చక్రవర్తుల్లో ప్రఖ్యాతి పొందిన ‘శాతకర్ణి’ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. రాజ దర్బార్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవల బాలయ్య, శ్రేయ, హేమమాలినిపై చిత్రీకరించారు.

కాగా నిన్నటి నుండి బాలయ్య, శ్రేయలపై ఓ ప్రణయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. సీతారామ శాస్త్రి ఈ గీతాన్ని రచించగా, ‘కంచె’ సినిమాకి సంగీతమందించిన చిరంతన్ భట్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా చిత్రీకరణ వీలైనంత త్వరగా ముగించి సీజీ టీమ్ కి అప్పజెప్పాలని క్రిష్ అండ్ కో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ కోసం 4 బృందాలు పనిచేస్తున్నాయట. బాలయ్య వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2017 జనవరి 12 విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus