GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపుదలకు వేదికగా నిలిచిన గ్లోబల్ బ్యూటీ ట్రెజర్(Global Beauty Treasure -GBT) సీజన్ 3 కి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం జూలై 12న హైదరాబాద్‌లోని దసపల్లా స్టార్ హోటల్లో ఘనంగా జరగనుంది అని నిర్వాహకులు ప్రకటించారు.

GBT Season-3

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, మోడల్స్, బ్యూటీ క్వీన్స్, ఫ్యాషన్ డిజైనర్లు, ఫ్యాషన్ మరియు బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులు, కార్పొరేట్ భాగస్వాములు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్- 2022 (Mrs. India International – 2022) విజేత, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుహాసిని పాండ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ “గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్-3 మరో ఇన్స్పిరేషనల్ జర్నీకి నాంది పలుకుతోంది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం. టీమ్ GBT అంకితభావంతో ఈ సీజన్‌ను మరింత విజయవంతంగా నిర్వహిస్తుందనే నమ్మకం మాలో ఉంది. అందరి సహకారంతో ఈ సీజన్‌ను చిరస్మరణీయంగా తీర్చిదిద్దుతాం” అని పేర్కొన్నారు.

గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ (GBT) సీజన్-3 కార్యక్రమానికి ప్రైకస్ డిజిటల్(Prikus Digital) స్ట్రాటజిక్ & డిజిటల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తూ, ఈవెంట్ బ్రాండింగ్, ప్రమోషన్స్, పబ్లిక్ రిలేషన్స్, నిర్వహణ బాధ్యతలను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ క్రమంలో పీలేరు సర్పంచ్(Pileru Sarpanch) డాక్టర్ షేక్ హబీబ్ పాషా, ప్రైకస్ సీఈఓ (Prikus CEO) ప్రమీల్ అర్జున్, స్కిల్ వేదా ఇన్నోవేషన్స్(Skillvedha Innovations CTO) సందీప్ అవుటపల్లి, వాసవి ఇన్నోవేషన్స్ అధినేత మెహర్ తేజ, ప్రముఖ రైఫిల్ షూటర్ పి. భువనేశ్వరి, ప్రైకస్ డిజిటల్ (Prikus Digital) బృందం, టీమ్ GBT సభ్యులు కలిసి శ్రీమతి సుహాసిని పాండ్యంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ (GBT) సీజన్-3 ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంతో గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్-3 కు అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. అందం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారతను ప్రోత్సహించే ఈ వేదిక మరో విజయవంతమైన అధ్యాయానికి నాంది పలుకుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus