‘బిగ్ బాస్2’ గీతా మాధురి ప్రెగ్నెంట్?

Advertisement

టాలీవుడ్ సింగర్ గీతా మాధురి.. ప్రేక్షకులకు పరిచయం లేని పేరు. సింగర్ గా చాలా పాటలతో మనల్ని ఆకట్టుకుంది. ఇక గతేడాది ‘బిగ్ బాస్2’ లో రన్నర్ గా గా నిలిచింది. దాదాపు ద‌శాబ్ద కాలంగా నుండీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ… `బిగ్‌బాస్‌2` తోనే ఈమె మరింత ఫేమస్ అయ్యింది. ఈ షో లో ఈమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక విన్నర్ కౌశల్ ను ఈమెను ‘టామ్ అండ్ జెర్రీ’ అనేంతలా ఫేమస్ అయ్యారు. ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్నారు వీరిద్దరూ. ఈ షో ద్వారా ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. ఐదేళ్ళ క్రితం సినీ న‌టుడు నందూని వివాహం చేసుకుంది గీతా మాధురి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ త‌ల్లిదండ్రులు కాబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం గీతా మాధురి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. గీత‌, నందు అధికారికంగా ఈ విష‌యం ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ వారి స్నేహితులు, సన్నిహితుల సోష‌ల్ మీడియా ద్వారా గీత‌కు, నందుకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus