Geetha Govindam: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా.. ఆమె కావాలంటున్న ఫ్యాన్స్‌

Advertisement

ఆదివారం సాయంత్రం.. ఎలాంటి సినిమా అప్‌డేట్స్ లేకుండా సినిమా జనాలకు బోరింగ్‌గా సాగుతున్న సమయం అది. అప్పుడే ఓ వార్త ఫొటో రూపంలో బయటకు వచ్చింది. దాంతోపాటే సోషల్‌ మీడియాలో ‘వీ వాంట్‌..’ అంటూ ఓ ఉద్యమం మొదలైంది. ఇదంతా ఏ సినిమా గురించి అని డౌట్‌ పడుతున్నారు అంటే.. ఆ అప్‌డేట్ మీరు చూడకపోయుండాలి, లేదంటే మీరు విజయ్‌ దేవరకొండ అభిమాని కాకపోయుండాలి. ఎందుకంటే పైన మేం చెప్పిన విషయాలు విజయ్‌ సినిమా గురించే.

‘గీత గోవిందం’.. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో ఎంతటి విజయం అందుకుందో అందరికీ తెలుసు. కెరీర్‌ను సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రేంజికి తీసుకెళ్లిన సినిమా అది. ఆ సినిమా కాంబినేషన్‌ ఎలా కుదిరిందో కానీ.. సినిమా అద్భుతాలు చేసింది. విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన జోడీ అభిమానులకు కనులపండువగా నిలిచింది కూడా. గీతగా రష్మిక.. విజయ్‌ గోవింద్‌గా విజయ్‌ దేవరకొండ అదరగొట్టేశారు. ఇప్పుడు ఆ కాంబినేషన్‌ మళ్లీ రాబోతోంది. విజయ్‌ – పరశురాం ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు దిల్‌ రాజు నిర్మాత.

ఈ విషయం ఇలా సోషల్‌ మీడియాలో కనిపించిందో లేదో వెంటనే అభిమానులు మరి ‘గీత’ సంగతేంటి అని అడుగుతున్నారు. అంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందననే ఉండాలి అనేది వారి మాట. మరి ఈ మాటలు దిల్‌ రాజు, విజయ్‌, పరశురాం వరకు వెళ్తాయో లేదో చూడాలి. వెళ్తే, రష్మిక ఒప్పుకుంటే మరోసారి ఆ హాట్‌ జోడీ.. వెండితెరపై కనిపించబోతోంది. విదేశీ ట్రిప్పులకు కలసి వెళ్లారు అంటూ పుకార్లు అవసరం లేకుండా..

షూటింగ్‌ కోసం ఇద్దరూ ఇప్పుడు విదేశాలకు వెళ్లొచ్చు. అది చూసి ఫ్యాన్స్‌ ఆనందపడొచ్చు. సో బాల్‌ ఇప్పుడు వాళ్ల దగ్గరే ఉంది. ‘ఖుషి’ సినిమా ఆగిపోవడంతో ప్రస్తుతం విజయ్‌ ఖాళీగానే ఉన్నాడు. ‘లైగర్‌’ పరాజయం నుండి కోలుకుని సినిమాలు ఓకే చేస్తూ వస్తున్నాడు. ఇటీవల గౌతమ్‌ తిన్ననూరి సినిమాను ఓకే చేసి, అనౌన్స్‌ చేశారు. అది మాస్ యాంగిల్‌లో ఉంటుంది. ఇప్పుడు పరశురాం సినిమా క్లాస్‌ లుక్‌లో ఉంటుంది అంటున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news