నటిగా ఎంట్రీ ఇస్తోన్న ప్రముఖ గాయని!

  • November 20, 2016 / 06:37 AM IST

నటులు పాటలు పాడటం ఈ మధ్య ట్రెండ్ గా మారుతోంది. గాయకులు, రచయితలు మహా అయితే అతిథి పాత్రల్లో తళుక్కుమంటారు. సంగీత దర్శకులైతే ఏకంగా హీరోలైపోతున్నారనుకోండి.. అయితే ఓ గాయని పూర్తి స్థాయి నటిగా మారడం బహుశా ఇదే తొలిసారి అనవచ్చు. అయితే ఆ గాయని కొంతకాలంగా ఇలాంటి వార్తలతో అందరి నోట్లో నానుతున్న సునీత మాత్రం కాదు. మరెవరంటే.. నేటితరంలో మేటి గాన మాధురి.. గీతా మాధురి.

పేరుకి తగ్గట్టుగా ఇప్పటివరకు మధురమైన పాటలతో ప్రేక్షక లోకాన్ని అలరించిన ఈమె త్వరలో నటిగా తెరంగేట్రం చేయనుందిట. అదీ ఓ తమిళ దర్శకుడు రూపొందిస్తున్న సినిమా ద్వారా. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తోంది. అయితే ఆ వివరాలేవీ ఇంకా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది చిత్ర బృందం. సాధారణంగా గాయనీమణుల కెరీర్ పాటలు, పలు సినిమాలకు డబ్బింగ్ వంటి వాటితో ముడిపడి ఉంటుంది. మరి నటిగా కొత్త ఒరవడి మొదలెట్టిన గీతా మాధురికి ఎలాంటి అనుభవం ఎదురు కానుందో..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus