Geetu Remuneration: ‘బిగ్ బాస్ 6’ కి గాను గీతూ రాయల్ ఎంత అందుకుందో తెలుసా?

  • November 9, 2022 / 05:21 PM IST

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప'(ది రైజ్) రిలీజ్ టైంలో పాపులర్ అయిన యాంకర్లలో గీతూ రాయల్ ఒకరు. అంతకు ముందు ఈమె ఎవరో చాలా మందికి తెలీదు అనే చెప్పాలి? ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఇంకా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో ఈమె స్ట్రాటజిక్ గా గేమ్ ఆడుతుంది అని అంతా అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా ఈమె గత వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

ఈమె కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈమె గేమ్ ఆడే పద్ధతి బాగానే ఉన్నా.. ఊరికే నోరు పారేసుకోవడం, దురుసుగా ప్రవర్తించడం.. వంటివి ప్రేక్షకులను బాగా ఇరిటేట్ చేశాయి.అందుకే ఈమె త్వరగానే హౌస్ లో నుండి బయటకు వచ్చేసింది. ‘బిగ్ బాస్’ వాళ్ళు గేమ్ ను మరింతగా రా గా ప్రెజెంట్ చేయడం కోసమే ఈమె నెగిటివ్ ఆటిట్యూడ్ చూపించేలా స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు అనే కామెంట్స్ కూడా బయట వినిపిస్తున్నాయి.

హౌస్ లో నుండి బయటకు వచ్చిన వాళ్లంతా ఇంటర్వ్యూలలో ‘బిగ్ బాస్’ పై నెగిటివ్ గా ఏదో ఒక కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఇలా ఉండగా.. బిగ్ బాస్ 6 లో పాల్గొన్నందుకు గీతూకి ఎంత పారితోషికం ఇచ్చి ఉంటారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. గీతూకి వారానికి రూ.30 వేల పారితోషికాన్ని బిగ్ బాస్ టీం ఫిక్స్ చేశారట.

9 వారాల పాటు హౌస్ లో ఉంది కాబట్టి ఈమెకు రూ.2.7 లక్షల నుండి రూ.3 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ఇది అఫీషియల్ గా బయటకు వచ్చిన లెక్కలు. అనఫీషియల్ గా బిగ్ బాస్ టీం గీతుకి మరింతగా అమౌంట్ ఇచ్చినట్టు ఇన్సైడ్ టాక్. దాంతో కలుపుకుని అటూ ఇటుగా ఈమెకు రూ.5 లక్షల వరకు అంది ఉంటుంది అని అంచనా.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus