Acharya Movie: ఆచార్య ఫైనల్ ఎడిట్ లో ఆ పాత్రను తీసేశారా?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా, ఈ సినిమా గురించి ఒక్కొక్క విషయం బయటపడటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Click Here To Watch NOW

ఈ క్రమంలోనే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో కాజల్ పాత్ర అనవసరమని భావించి డైరెక్టర్ కాజల్ అగర్వాల్ సినిమా నుంచి తప్పించారు. అలాగే ఆమె నటించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగించారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో జబర్దస్త్ శ్రీను కూడా పలు కీలక సన్నివేశాలలో నటించారు. ఈ సినిమా కోసం గెటప్ శ్రీను ఎక్కువ రోజులపాటు సమయం కేటాయించారు.

తన అభిమాన హీరోగా భావించే మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు గెటప్ శ్రీను ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గెటప్ శ్రీను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమాలో గెటప్ శ్రీను నటించిన సన్నివేశాలు కూడా తొలగించారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి గెటప్ శ్రీను ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే వారికి కూడా ఎంతో మంచి గుర్తింపు వస్తుందని భావించిన గెటప్ శ్రీను ఈ విధమైనటువంటి చేదు అనుభవం ఎదురు కావడంతో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గెటప్ శ్రీను నటించిన సన్నివేశాలు తొలగించడానికి కాజల్ కారణం కావచ్చని బహుశా ఆయన కాజల్ అగర్వాల్ తో కలిసి నటించిన కామెడీ సన్నివేశాలు కనుక ఉంటే వాటిని తొలగించి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సీరియస్ సినిమాలో ఫన్ ప్రొపర్ గా మిక్స్ కావడం లేదని భావించి ఈ కామెడీ సన్నివేశాలను తీసేసి ఉంటారని భావిస్తున్నారు. ఏదిఏమైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎలా అయితే సంతోషిస్తామో ఆ సన్నివేశాలను తీసేస్తే అంతే విచారం కూడా వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం గెటప్ శీను పరిస్థితి ఇలాగే ఉందని పలువురు భావిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus