కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను దించిన ‘సాహో’ టీం?
- May 28, 2019 / 03:02 PM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించేసింది.ఇలాంటి తరుణంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ ఎహసాన్ లాయ్ లు తప్పుకున్నట్టు ఓ పోస్ట్ చేసి పెద్ద తుఫాన్ రేపారు. దీని వెనుక ఎటువంటి కారణం ఉందో తెలీదు కానీ ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇంతకీ ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఫిలింనగర్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
- సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
వివరాల్లోకి వెళితే… సుజీత్ గత చిత్రానికి సంగీతమందించిన జిబ్రాన్ ను ‘సాహో’ కోసం తీసుకున్నారట. తెలుగులో కూడా ‘జిల్’ ‘ బాబు బంగారం’ ‘హైపర్’ వంటి చిత్రాలకి మ్యూజిక్ ఇచ్చాడు జిబ్రాన్. గతేడాది విడుదలైన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రట్ససన్’ కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు జిబ్రాన్. ఇప్పుడు ‘సాహో’ చిత్రానికి కూడా అదే రేంజ్లో మ్యూజిక్ ఇస్తే… ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.

















