సినిమా ప్రచారాన్ని ఒక నటుడు/నటి మీదే నడిపిస్తే.. ఎలా ఉంటుంది. గతంలో ఇలాంటి సినిమాలు చాలానే చూసుంటారు. అయితే అవి అగ్రహీరోల సినిమాలే అయి ఉంటాయి. లేదంటే స్టార్ హీరోయిన్ చేసిన చిన్న సినిమా అయి ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి సింగిల్ స్పెషల్ సినిమా చూడబోతున్నామా? ఆ సినిమా టీమ్ మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది. ఆ సినిమా పేరే ‘జిన్నా’. మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ ఇతర ముఖ్య పాత్రధారులు.
‘జిన్నా’ సినిమా ప్రచారం అంతా సన్నీ లియోన్ మీదే సాగుతుందా? మంచు విష్ణు, కోన వెంకట్ మాటలు వింటుంటే కచ్చితంగా అవును అనిపిస్తోంది. సినిమా టీజర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఈ సందర్భంగా విష్ణు, కోన వెంకట్ చెప్పిన మాటలు వింటుంటే.. సన్నీ లియోన్‌ని ముందు పెట్టి సినిమాను మార్కెటింగ్ చేసే పనిలో ఉన్నారు అని అర్థమవుతోంది. ఈ క్రమంలో సగటు సినిమా ప్రేక్షకులు నమ్మని విషయాలు కూడా కొన్ని చెప్పారు.
అందులో మచ్చుకు ఓ రెండు వదులుతాం మీరూ చదివేయండి. ఈ సినిమాను కథను దర్శకుడు ఇషాన్ సూర్య విష్ణుకి మొదట చెప్పలేదట. సన్నీ లియోన్‌కి కథ వినిపించి, ఆమె ఓకే అన్నాక అప్పుడు విష్ణుకి చెప్పారట. ఏంటి షాక్ అయ్యారా? ఇంకా ఇలాంటిది ఇంకొకటి ఉంది. ఈ సినిమాలో సన్నీ పోషించిన పాత్రను ఆమె తప్ప ఇంకెవరూ చేయలేరట. విష్ణు సన్నిహితులు కూడా ఆయనతో ఇదే మాట చెప్పారట. ఇంతకీ సన్ని చేసిన పాత్ర ఏంటి అనుకుంటున్నారా? అప్పుడప్పుడు దెయ్యంలా మారే యువతి పాత్ర.
విష్ణు, కోన వెంకట్ ఈ మాటలు ఎందుకు చెప్పారో తెలియదు కానీ.. సినిమా ప్రచారంలో మాత్రం సన్నీ లియోన్ క్రేజ్‌ను బాగా వాడేద్దాం అనుకుంటున్నారు అని మాత్రం తెలిసిపోతోంది. మరి ‘జిన్నా’ తెలివితేటలు ఎంతమేర పని చేస్తాయో చూడాలి. అయినా సన్నీ కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఫీట్‌లు చేస్తే బాగుండేదేమో. ఓల్డ్ ఫీట్‌లు ఇప్పుడెందుకో? అనే సన్నాయి నొక్కులు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!