Girija Oak: గంటకు ఎంత అని అడుగుతున్నారు.. వైరల్‌ స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

ఒక్క ఫొటో, అందులోనూ పద్ధతిగా చీర కట్టుకుని కూర్చున్న ఫొటోతో వైరల్‌ అవ్వొచ్చని తెలుసా? ఒకవేళ ఈ విషయం తెలియదు అంటే మీకు కచ్చితంగా గిరిజా ఓక్‌ గురించి తెలియదు అని చెప్పాలి. నీలి రంగు చీరలో ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఓ ఫొటోను క్లిక్‌మనిపించాడు ఆమె ఫొటోగ్రాఫర్‌. ఆ తర్వాత ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం, ఆమె వైరల్‌ అయిపోవడం అమాంతం జరిగిపోయాయి. ఆ పాపులారిటీ ఆమెకు ఇప్పుడు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ విషయాల్ని ఆమె ఇటీవల చెబుతూ బాధపడింది.

Girija Oak

గిరిజా ఓక్ మరాఠీ సినిమాలోనే కాదు, ఇండియన్‌ సోషల్‌ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఎప్పటి నుండో సినిమాల్లో నటిస్తున్న ఈ అందాల తార ఒకే ఒక్క ఇంటర్వ్యూ క్లిప్‌తో సెన్సేషన్‌ అయింది. లేటు వయసులో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ పాపులారిటీ, క్రేజ్ కారణంగా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదని చెప్పింది. కొత్తగా సినిమా ఆఫర్లు రావడం లేదని తెలిపింది. కానీ నెగెటివ్‌ కామెంట్లు చాలా వస్తున్నాయి అని చెప్పింది.

నీ రేటెంత? అని కొంతమంది ఆకతాయిలు సోషల్‌ మీడియాలో కామెంట్లు, మెసేజ్‌లు చేస్తున్నారని చెప్పింది. నీతో గంటసేపు గడపాలంటే ఎంత తీసుకుంటావ్‌? అని కొంతమంది అంటున్నారని.. నన్ను ఇలా దూషించి, తక్కువ చేసి మాట్లాడేవాళ్లు ఆన్‌లైన్‌ చాటునే చేస్తున్నారని.. ఎదుటపడితే అలా అనకపోవచ్చు అని కంట్రోల్డ్‌ కామెంట్‌ చేసింది.

‘తారే జమీన్‌ పర్‌’, ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’, ‘సైకిల్‌ కిల్‌’, ‘కాలా’, ‘జవాన్‌’, ‘ద వ్యాక్సిన్‌ వార్‌’, ‘ఇన్‌స్పెక్టర్‌ జండే’ వంటి హిందీ సినిమాల్లో నటించింది గిరిజా ఓక్. ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ సినిమాలో సందీప్ కిషన్‌తో రొమాన్స్‌ చేసిన వీడియోలు రీసెంట్‌గా సోషల్‌ మీడిమాలో తెగ షేర్‌ అవుతున్నాయి.

ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus