టాలీవుడ్‌లో వరుసగా జరుగుతున్న సెలబ్రిటీ పెళ్లిళ్ల జాబితాలో తాజాగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా చేరిపోయారు. రాహుల్ తన ప్రేయసి హరిణ్యను నవంబర్ 27న పెద్దల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం జరిగిన నిశ్చితార్థం ద్వారా ఈ జంట తమ బందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పెళ్లితో జీవితంలోని కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నారు ఈ నూతన జంట.
సాంప్రదాయ దుస్తుల్లో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ సెలెబ్రెటీలు మరియు రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. రాహుల్–హరిణ్య పెళ్లి ఫోటోలు ఇంకా అధికారికంగా షేర్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెహందీ, హల్ది, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో ఆల్రెడీ ఈ జంట ట్రెండింగ్లో ఉన్నారు. ప్రత్యేకంగా సంగీత్ వేడుకలో హరిణ్యకు తన అభిమాన క్రికెటర్ అయిన యుజ్వేంద్ర చాహల్‌ను ఆహ్వానించడం ద్వారా రాహుల్ తన జీవిత భాగస్వామికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు.
సింగర్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న రాహుల్, ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. బిగ్ బాస్ విజేతగా ఆయన సాధించిన క్రేజ్, ఆయన కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. బిగ్ బాస్ సమయంలో వచ్చిన లవ్ బ్రేకప్ రూమర్స్ అన్నీ అసత్యమని, తన నిజమైన ప్రేమతోనే ఏడడుగులు నడవడం ద్వారా రాహుల్ మరోసారి నిరూపించాడు.
ఈ కొత్త జంటకు అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా వారి విషెస్ తెలియజేస్తున్నారు.