అల్లు వారి వారసుడు…స్టైలిష్ స్టార్ “అల్లుఅర్జున్” క్రేజ్ మరింత పెరిగింది. దీనితో ఆయన అభిమానులు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు…ఇంతకీ విషయం ఏమిటంటే…తాజాగా డైనమిక్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడుతో తన స్టామినా ఏంటో మరోసారి రుచి చూపించాడు. దాదాపుగా తెలుగులోనే ఇప్పటికీ 70 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను సాధించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు బన్నీ. అదే క్రమంలో ఈ సినిమాను ఈ నెల 13న మలయాళంలో ‘యోధవ్..ది వారియర్’ అన్న పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు…
అసలే అల్లు అర్జున్ కు అక్కడ మల్లు అర్జున అన్న పేరు ఉంది, క్రేజ్ అయితే భీభత్సంగ ఉంది….అందులోనూ ఆయన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చేసిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఈ యువ హీరోకి తెలుగులో ఎంత మార్కెట్ ఉందో కేరళలో కూడా అంతే మార్కెట్ ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు తొలి ఆట నుంచి డివైడ్ టాక్ వచ్చినా అవేవి సినిమా కలక్షన్స్ మీద ప్రభావితం అయ్యేలా చేయలేదు. సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ కొట్టి సమ్మర్ హిట్ గా నిలిచింది…ముఖ్యంగా బోయపాటి మాస్ మాస్ టేకింగ్ పుణ్యమా అని బి,సి సెంటర్స్ లో ఈ సినిమాకు కలక్షన్ల సునామీ కురుస్తుంది. వీటన్నింటితో పాటు సొంత బ్యానర్లో తాను సినిమా తీస్తే ఫ్లాప్స్ వస్తున్నాయి అన్న అపవాదిని ఈ సినిమాతో తుడిచేసాడు. మరి తెలుగులో భారీ హిట్ కొట్టిన బన్నీ….కేరళలో ఏం చేస్తాడో చూడాలి.!!!