ప్రభాస్,అనుష్క ల పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన గోపీచంద్ హీరోయిన్…!

ప్రభాస్, అనుష్క … ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ళు కలిసి నాలుగు సినిమాల వరకూ చేసారు. ‘బిల్లా’ ‘మిర్చి’ ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి2’… వీటిలో ఒక్క ‘బిల్లా’ సినిమా యావరేజ్ అయ్యింది తప్ప మిగిలిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లే…! అయితే వరుసగా 5 ఏళ్ళ వరకూ కలిసి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు కాబట్టి.. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే వీరు ప్రేమలో ఉన్నారని. కచ్చితంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని… పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రభాస్, అనుష్క లు … అవన్నీ ఫేక్ న్యూస్ లని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా అవి ఆగలేదు.

అయితే వీళ్ళ పెయిర్ కు మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఇద్దరూ మంచి హైట్ కాబట్టి.. వీళ్ల పెయిర్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఈ పెయిర్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని చాలా మంది కోరుకుంటారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు .. ఓ హీరోయిన్ కూడా ఇదే కోరుకుంటుంది.ఆ హీరోయిన్ మరెవరో కాదు … గోపీచంద్ ‘రణం’ సినిమా ద్వారా పాపులర్ అయిన కామ్నా జెఠ్మలానీ. ఇటీవల ఓ సందర్భంలో ఈమె స్పందిస్తూ…’నా ఫేవరెట్ హీరో ప్రభాస్.

ఇక ఫేవరెట్ హీరోయిన్ అనుష్క. వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రభాస్, అనుష్క లు మళ్ళీ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని ఉంది. వీళ్లిద్దరినీ కలిపి చూడటం అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది. ఈమె సినిమాల్లో పెద్దగా రాణించకపోవడంతో బెంగుళూర్ కు చెందిన ఓ బిజినెస్ మెన్ ను పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus