ప్రభాస్ (Prabhas) పెళ్లి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్. అతను చేసే సినిమాలు అన్నీ పాన్ వరల్డ్ మార్కెట్స్ ను టార్గెట్ చేసి రూపొందుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి కూడా దేశ,విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. అలాంటి వారందరికీ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదనే టాపిక్ హైలెట్ గా అనిపిస్తుంటుంది. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి టాపిక్ ఎత్తితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పై కూడా ఫైర్ అయిపోతుంటాడు.
దివంగత కృష్ణంరాజు గారు కూడా చివరి రోజుల్లో ఈ టాపిక్ పై మాట్లాడటం మానేశారు అంటే అర్థం చేసుకోవచ్చు విషయం ఎలా ఉందనేది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కి గోపీచంద్ (Gopichand) బెస్ట్ ఫ్రెండ్. ఈ మధ్య ఇతని సినిమాల ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఇతను ‘భీమా’ (Bhimaa)సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ రిపోర్టర్ గోపీచంద్ ని ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించాడు.
‘మీ ఫ్రెండ్ కి మీరు దగ్గరుండి పెళ్లి చేయొచ్చు కదా? అసలు అతను పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు?’ అని ప్రశ్నించగా, అందుకు గోపీచంద్ ‘నో కామెంట్స్’ అంటూ బదులిచ్చాడు. మళ్ళీ ఆ సీనియర్ రిపోర్టర్ ఆ టాపిక్ ని డ్రాగ్ చేయగా.. ‘నో కామెంట్స్’ అని మరోసారి గోపీచంద్ రియాక్ట్ అవ్వడం జరిగింది.
ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!
ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?