Gopichand: పేద పిల్లలను చదివిస్తున్నా ప్రచారం చేసుకోని గోపీచంద్.. హ్యాట్సాఫ్ అనేలా?

  • March 2, 2024 / 12:21 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ లో నటించి తర్వాత కాలంలో హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకుని గోపీచంద్ అభిమానులకు దగ్గరయ్యారు. ఈ నెల 8వ తేదీన గోపీచంద్ భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోకు హాజరైన గోపీచంద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఫ్యామిలీ ఎలా ఉన్నారనే ప్రశ్నకు గోపీచంద్ స్పందిస్తూ పెద్దోడికి పదేళ్లు అని చిన్నోడికి పదేళ్లు అని లోన్లు ఎక్కువయ్యాయని కామెంట్లు చేశారు. ఇప్పుడు సినిమాల విషయంలో మొహమాటాలు అయితే లేవని ఆయన చెప్పుకొచ్చారు. నువ్వు చాలామందిని చదివిస్తున్నా ఎందుకు ఆ విషయంలో బయటకు చెప్పుకోవని అలీ ప్రశ్నించగా నేను చెప్పుకోవాలని అనుకోనని నా పేరు కూడా చెప్పకుండా కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నానని ఆయన అన్నారు.

బాగా చదివే పిల్లలు ఉంటే చదివించాలని అనుకుంటానని గోపీచంద్ వెల్లడించారు. బాగా చదివే పేద పిల్లల కోసం గోపీచంద్ చేస్తున్న పనిని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. భీమా సినిమాతో గోపీచంద్ సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కన్నడలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న సినిమాలేవీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం లేదు.

శివరాత్రి కానుకగా రిలీజ్ అవుతున్న గామి, భీమా సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. భీమా సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. గోపీచంద్ కెరీర్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. గోపీచంద్ (Gopichand) శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus