సంతోష్ శ్రీ‌నివాస్ దర్శకత్వంలో నటించనున్న గోపిచంద్

  • March 14, 2018 / 07:55 AM IST

ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ కొంతకాలం క్రితం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఒక క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. ప‌వ‌న్ కు కూడా స్టోరీ వినిపించాడు. న‌చ్చ‌డంతో త‌ప్ప‌కుండా చేద్దామ‌ని మాట ఇచ్చారు. ఇదంతా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. అయితే కాటమరాయుడు తర్వాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి చేశారు. దీని తర్వాత అయిన డేట్స్ ఇస్తారని సంతోష్ ఓపిగ్గా ఎదురు చూసారు. ఆ మూవీ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో సంతోష్ కి కుదరదని స్పష్టం చేశారు. దీంతో నిరాశపడ్డ సంతోష్ శ్రీ‌నివాస్ పవన్ కోసం రెడీ చేసిన కథను గోపిచంద్ కి వినిపించారు.

కథ నచ్చడంతో గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్క్రిప్ట్ పక్కాగా కంప్లీట్ కావడంతో ఉగాది రోజు ముహూర్తపు షాట్ కి రెడీ అయిపోయారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి బివిఎస్ఎన్ ప్రసాద్ ఆసక్తిగా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి డైరక్టర్ గా మారిన సంతోష్ కందిరీగతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత చేసిన రభస, హైపర్ రెండూ నిరాశపరిచాయి. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. గోపిచంద్ కి కూడా హిట్ ఇప్పుడు చాలా అవసరం. సో ఇద్దరూ విజయమే లక్ష్యంగా కష్టపడడనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus