Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నా కెరీర్ లో చెత్త సినిమాలు మాత్రం చేయలేదు – గోపీచంద్

నా కెరీర్ లో చెత్త సినిమాలు మాత్రం చేయలేదు – గోపీచంద్

  • July 4, 2018 / 06:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా కెరీర్ లో చెత్త సినిమాలు మాత్రం చేయలేదు – గోపీచంద్

18 ఏళ్ల కెరీర్ లో గోపీచంద్ నటించింది 25 సినిమాలే. హిట్ పర్సెంట్ తక్కువ ఉండొచ్చు కానీ.. ఒక నటుడిగా తన పాత్రకు ఎప్పుడూ పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు గోపీచంద్. అందుకే మాస్, క్లాస్ అన్న బేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులకు గోపీచంద్ ఒన్నాఫ్ ది ఫేవరెట్ హీరో. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ లేక కాస్త ఢీలాపడ్డాడు కానీ.. సరైన సినిమా ఒకటి పడితే మాత్రం హీరోగా నిలదొక్కుకొని, అగ్ర కథానాయకుడిగా క్రేజ్ సంపాదించుకోవడానికి కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న గోపీచంద్ మునుపటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అందుకే ఈసారి కమర్షియల్ అంశాలతోపాటు అండర్ కరెంట్ సోషల్ మెసేజ్ కూడా ఉన్న “పంతం” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు గోపీచంద్. ఎన్టీయార్ లాస్ట్ సూపర్ హిట్ ఫిలిమ్ “జైలవకుశ” చిత్రానికి రైటర్ గా వర్క్ చేసిన చక్రి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన “పంతం” చిత్రంలో గోపీచంద్ సరసన మహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా.. రేపు (జూలై 5) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు గోపీచంద్..!!

చెప్పినంత బాగా తీస్తాడా లేదా అని భయపడ్డాను కానీ..
నాకు ఆల్రెడీ కొత్త డైరెక్టర్స్ తో మాత్రమే కాక కొందరు సీనియర్ డైరెక్టర్స్ తోనూ పెద్ద ఫ్లాప్స్ వచ్చాయి. కథ చెప్పినంత బాగా తీయలేకపోవడమే అందుకు కారణం. చక్రి విషయంలోనూ మొదట ఆ భయం ఉండేది. ఎందుకంటే కుర్రాడు కథ చాలా అద్భుతంగా చెప్పాడు. చెప్పినంత బాగా సినిమా తీయగలాడా లేదా అనే అనుమానం ఉండేది. చెప్పినంత పర్ఫెక్ట్ గా సినిమా తీశాడు చక్రి.Gopichand

నా పంతం ఏమిటనేది రేపు తెలుస్తుంది..
“పంతం” ఒక అండర్ కరెంట్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్. ఇప్పటివరకూ ఈ తరహా సినిమా రాలేదు అని చెప్పను కానీ.. ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే సినిమా మాత్రం అవుతుంది. సమాజంలో మనం రోజూ ఎదుర్కొనే సమస్యలను కొన్ని చూపిస్తూనే.. ప్రధానమైన ఓ సమస్యకు మాత్రం సోల్యూషన్ చెప్పాలనుకొన్నాం. ఇంతకీ సినిమాలో నా “పంతం” ఏమిటి అనేది మాత్రం రేపు వెండితెరపై చూడండి.Gopichand

ప్రసాద్ మూరెళ్ళ గారి సహాయం మరువలేనిది..
“పంతం” స్క్రిప్ట్ ను తొలుత రమేష్ రెడ్డి అనే డైలాగ్ రైటర్ నా వద్దకు తీసుకొచ్చారు. దాదాపు 3 నెలల తర్వాత కథ విన్నాను. మధ్యలో ప్రసాద్ మూరెళ్ళ గారు కూడా కథ విను గోపీ నీకు చాలా బాగుంటుంది అని చెప్పారు. కథ విన్న తర్వాత “నాకు నచ్చిందండీ.. కాకపోతే చెప్పినంత బాగా తీయగలాడా, చూస్తే కుర్రాడు కొత్తలా ఉన్నాడు” అని నా మనసులో మాట చెప్పాను. వెంటనే ప్రసాద్ గారు బాధ్యతను తన భుజాలపై వేసుకొన్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు తన ఎక్స్ పీరియన్స్ చాలా హెల్ప్ అయ్యింది. ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. ఆయన లేకపోతే “పంతం” అవుట్ పుట్ ఇలా ఉండేది కాదు.Gopichand

కమిట్ మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన..
కె.కె.రాధామోహన్ గారు సినిమా అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. మొదట్లో ఆయన కూడా కొత్త దర్శకుడితో రిస్కేమో అని భయపడ్డారు కానీ.. మా కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసి ఆయన కూడా ధైర్యంగా ముందుకొచ్చారు. ఒక బడ్జెట్ అనుకొన్నాక ఆ మొత్తంలోనే సినిమా తీశామ్. నిర్మాతగా మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదాయన. మంచి కమిట్ మెంట్ తోపాటు సినిమా అంటే విపరీతమైన ఫ్యాషన్ ఉన్న నిర్మాత ఆయన.Gopichand

నన్ను ఎవరూ “ఎంటి ఇలాంటి సినిమా తీశావ్” అని తిట్టలేదు..
నా కెరీర్ లో నేను చేసిన 25 సినిమాల్లో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ.. చెత్త సినిమాలు మాత్రం లేవు. దర్శకులు చెప్పినట్లుగా తీయకపోవడం వల్ల కొన్ని ఫెయిల్ అయితే, ఇంకొన్ని పబ్లిసిటీ సరిగా చేయక లేదా సరైన రిలీజ్ డేట్ సెట్ అవ్వక ఫెయిల్ అయ్యాయి. అంతే తప్ప నా కెరీర్ లో “ఏంట్రా గోపీ చంద్ ఇలాంటి సినిమా చేశాడు” అని ప్రేక్షకులు తిట్టుకొనే స్థాయి బ్యాడ్ ఫిలిమ్ ఒక్కటి కూడా లేదు అని నమ్మకంగా చెప్పగలను.Gopichand

టెన్షన్ లేదు అంటాను కానీ…
రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ లో సినిమా విడుదలకు ముందు టెన్షన్ పడతారా అని ఎవరు అడిగినా పెద్దగా టెన్షన్ పడను అని పైకి చెప్తుంటాను కానీ.. చాలా టెన్షన్ పడతాను. నేనెప్పుడు రిజల్ట్ గురించి కంటే జనాలు సినిమాని ఎలా రిసీవ్ చేసుకొన్నారు అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.Gopichand

మెహరీన్ మరింత అందంగా కనిపిస్తుంది..
మెహరీన్ ను ఇప్పటివరకూ చాలా బొద్దుగా చూసుంటారు. ఈ సినిమాలో అమ్మాయి బాగా చిక్కింది. చక్కగా నటించింది కూడా. ఈ సినిమా ఆ అమ్మాయికి మంచి ప్లస్ అవుతుంది.Gopichand

అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు..
కొన్ని సినిమాలు షూటింగ్ స్పాట్ లోనే తెలిసిపోతాయి రిజల్ట్ ఏమిటనేది. కానీ.. వీలైనంతలో రిజల్ట్ మరీ బ్యాడ్ గా ఉండకూడదు అని కష్టపడతాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకూ పర్లేదు కానీ.. ప్రమోషన్స్ టైమ్ లో సినిమా బాగా రాలేదు అని తెలిసి కూడా పైకి మాత్రం “సినిమా బాగా వచ్చింది, తప్పకుండా హిట్ అవుతుంది” అని చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. తప్పని పరిస్థితి, నిర్మాత ఆల్రెడీ కోట్లు ఖర్చు చేసి ఉంటాడు. ఏమీ చేయలేని పరిస్థితి అది.Gopichand

రిజల్ట్ పక్కన పెట్టేస్తే.. ప్రతి సినిమా ఎంజాయ్ చేశాను.
నేను నటించిన 25 సినిమాల్లో ఏది బెస్ట్, ఏది వరస్ట్ అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. అందుకు కారణం నేను నటించే ప్రతి సినిమా మేకింగ్ ప్రొసెస్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి సినిమా ఒక పాఠమే. కొన్ని గుణపాఠాలుగా కూడా మిగిలిపోతాయనుకోండి (నవ్వుతూ..).Gopichand

తదుపరి సినిమాలు..
“పంతం” రిలీజ్ అనంతరం ఇమ్మీడియట్ గా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి నిర్మాణంలో కుమార్ అనే కొత్తబ్బాయి దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుంది. ఆ సినిమా అనంతరం మళ్ళీ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయాలానుకొంటున్నాను. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు.Gopichand

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Gopichand Interview
  • #Gopichand Latest Movie
  • #Gopichand New Movie
  • #Gopichand Special Interview About Pantham

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

23 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

23 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

1 day ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

1 day ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version