Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 26, 2026 / 10:42 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మహేష్ ఎడ్లపల్లి (Hero)
  • రాశీ సింగ్  (Heroine)
  • రవివర్మ, విజయ్ అధిరాజ్, 30 ఇయర్స్ పృథ్వీ, గురు చరణ్ తదితరులు (Cast)
  • వైభవ్ కౌండిన్య  (Director)
  • యతి రేమెల్ల  (Producer)
  • శక్తికాంత్ కార్తీక్  (Music)
  • సతీష్  (Cinematography)
  • జై కుమార్ (Editor)
  • Release Date : 26th జూన్ 2026
  • వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ (Banner)

ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఎక్కువ శాతం రీ-రిలీజ్ సినిమాలు ఆకుపై చేశాయి. మూవీ లవర్స్ ను ఆకర్షించే సినిమా ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద డిజప్పాయింట్మెంట్. అయితే యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ నటించిన ‘గోస్సిప్’ అనే సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. దీనికి మినిమమ్ ప్రమోషన్స్ కూడా చేయకుండా వదిలేశారు. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి:

Gossip Movie Review

Gossip Movie Review And Rating

కథ: రమేష్ (విజయ్ అధిరాజ్) తన భార్య మమతకు నెలలు నిండటంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తాడు. తల్లి లేదా బిడ్డ.. ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడగలమని డాక్టర్లు చెబుతారు. ఆ సమయంలో రమేష్ తన భార్యను బతికించమని కోరతాడు. కానీ ప్రాణాపాయ స్థితిలో భార్య చనిపోగా, బిడ్డ బతుకుతుంది. ఆ పాపకు అజంతా(రాశీ సింగ్) అని నామకరణం చేస్తాడు రమేష్.మరో పెళ్లి చేసుకోమని బావమరిది ప్రకాశం (రవివర్మ) కోరినా రమేష్ అందుకు ఒప్పుకోడు. తల్లి లేని లోటు తెలియకుండా తన కూతురిని ఎంతో ప్రేమతో, బాధ్యతగా పెంచుకుంటానని చెబుతాడు.

ప్రకాశం కూడా తనకు సొంత కూతురు ఉన్నప్పటికీ.. అజంతాను తన పెద్ద కూతురిలా చూసుకుంటాడు. అయితే అజంతా పెరిగి పెద్దయ్యాక, స్నేహితులతో కలిసి సరదాగా పబ్బులకు, పార్టీలకు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో తేజ (మహేష్ ఎడ్లపల్లి) అనే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. దీన్ని గమనించిన ఆ ఏరియా కుర్రాళ్లు ఆమె గురించి తప్పుగా ప్రచారం చేస్తారు. ఆ మాటలు అజంతా మావయ్య ప్రకాశం చెవిన పడతాయి. దీంతో ఒకరోజు ప్రకాశం.. అజంతా జాతకాన్ని తీసుకెళ్లి రోనీ (30 ఇయర్స్ పృథ్వీ) అనే జ్యోతిష్యుడికి చూపిస్తాడు. అజంతా జాతకం చూసిన రోనీ.. ‘ఆమెది దరిద్రపు జాతకమని, పుడుతూనే తల్లిని లేదా తండ్రిని మింగేస్తుందని, అలాగే వయసుకొచ్చాక ఎఫైర్లు కూడా ఎక్కువగా పెట్టుకుంటుందని, కాబట్టి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసేయమని’ చెబుతాడు.

ప్రకాశం వెంటనే వెళ్లి ఈ విషయాలన్నీ రమేష్‌కు చెబుతాడు. ఈ క్రమంలో ‘నా కూతురి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడతావా?’ అంటూ కోపంతో ప్రకాశాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు రమేష్.కానీ ప్రకాశం మాటలు మనసులో ఉండిపోవడంతో.. తాను చూసిన ప్రవీణ్ (గురు చరణ్) అనే కుర్రాడిని పెళ్లి చేసుకోమని అజంతాను రమేష్ ఒత్తిడి చేస్తాడు. అందుకు అజంతా ఒప్పుకోదు. ‘నా లైఫ్ నా ఇష్టం’ అంటూ తండ్రిని ఎదిరిస్తుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్‌కు హార్ట్ ఎటాక్ వస్తుంది.ఆ వెంటనే ప్రాణాలు విడుస్తాడు. ఆ తర్వాత అజంతా జీవితం ఏమైందనేదే మిగిలిన కథ.

Gossip Movie Review And Rating

నటీనటుల పనితీరు: ఇది ఆల్మోస్ట్ విమెన్ సెంట్రిక్ మూవీ అయినప్పటికీ.. రాశీ సింగ్ మెయిన్ లీడ్ పోషించినప్పటికీ, పెర్ఫార్మెన్సుల్లో మాత్రం ఎక్కువ మార్కులు కొట్టేసింది రవివర్మ అనే చెప్పాలి. హీరోయిన్ మావయ్య పాత్రలో రవివర్మ పరకాయ ప్రవేశం చేసేశాడు. సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఇక రాశీ సింగ్ విషయానికి వస్తే.. ఆమె ఎందుకో ఈ పాత్రకి సెట్ అయినట్టు అనిపించలేదు. ఆమెకంటే యంగ్ గా ఉండే అమ్మాయి చేస్తే బాగుండేదేమో. పెర్ఫార్మన్స్ పరంగా కూడా రాశీ సింగ్ ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు.నవ్వినా.. ఏడ్చినా ఆమె ఎక్స్ప్రెషన్స్ ఒకేలా ఉండటం వల్ల.. అజంతా పాత్రకి ఆమె న్యాయం చేయలేకపోయింది అని చెప్పాలి. తండ్రి పాత్ర చేసిన విజయ్ అధిరాజ్ మాత్రం పర్ఫెక్ట్ క్యాస్ట్ అనిపించుకున్నాడు. 30 ఇయర్స్ పృథ్వీ పాత్ర వేణు స్వామికి స్పూఫ్..లా ఉంటుంది. ఆ పాత్ర వచ్చినప్పుడు ప్రభాస్, నాగచైతన్య- సమంత, రాజకీయ అంశాలపై వేణుస్వామి చేసిన కామెంట్స్ ని కూడా గుర్తుచేశారు. మిగతా నటీనటుల పాత్రలు అంతగా ఇంపాక్ట్ చూపలేదు.

Gossip Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘గోస్సిప్’ టైటిల్ కార్డ్స్ పడిన విధానం బాగుంది. అందుకు దర్శకుడు వైభవ్ కౌండిన్యని అభినందించాల్సిందే. అతనిలో టాలెంట్ ఉంది అని టైటిల్ కార్డ్స్ తో అర్థమైపోతుంది. అతను ఎంపిక చేసుకున్న పాయింట్ థియేటర్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది కాదు. కానీ స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసే అవకాశం ఉంది. కానీ కథకుడిగా ఓకే అనిపించినప్పటికీ దర్శకుడిగా మాత్రం పాస్ మార్కులు వేయించుకోలేకపోయాడు వైభవ్. కథనం చాలా లేజీగా సాగుతుంది. సీరియల్ ని తలపిస్తుంది. ఏమాత్రం గ్రిప్పింగ్ గా, ఎంగేజింగ్ గా అనిపించదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మావయ్య పాత్రనే సినిమాలో హైలెట్.కానీ దానికి ప్రాపర్ ఎండింగ్ లేదు. ఏదో షార్ట్ ఫిలింని ముగించినట్టు ముగించేశాడు దర్శకుడు. కొన్ని సంభాషణలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా కూతురికి పెళ్లిచేసే విషయంలో తండ్రి ఎలా ఆలోచించాలి అనేది వర్ణించిన తీరు బాగుంది. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సంగీతం అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. నిర్మాణ విలువలు తీసిపారేసే విధంగా అయితే లేవు.

Gossip Movie Review And Rating

విశ్లేషణ: ‘గోస్సిప్’ ఇంట్రెస్టింగ్ గా మొదలైనప్పటికీ.. తర్వాత సీరియల్ టైపు టేకింగ్ తో బోర్ కొట్టిస్తుంది. 20 నిమిషాల షార్ట్ ఫిలింని 2 గంటల పాటు సాగదీశారనిపిస్తుంది. థియేటర్లలో ఈ సినిమా నిలబడటం అన్ని విధాలా కష్టమే. అందుకే మేకర్స్ కూడా ఈ ప్రాపర్ గా ప్రమోట్ చేయలేదని అర్ధం చేసుకోవచ్చు.

Gossip Movie Review And Rating

ఫోకస్ పాయింట్: షార్ట్ ఫిలిం కంటెంట్.. సీరియల్ ను తలపించే టేకింగ్

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gossip Movie

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

4 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

7 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

8 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

23 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

24 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version