Balakrishna, Pawan: ఆ విషయంలో బాలయ్య, పవన్ లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

  • February 6, 2023 / 03:27 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో షూట్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో పాటు సెకండ్ పార్ట్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలయ్య, పవన్ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బాలయ్య, పవన్ లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సొంత కుటుంబ సభ్యులకు చిన్న కష్టం వచ్చినా సహాయం చేసే విషయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చే విషయంలో బాలయ్య,

పవన్ ముందువరసలో ఉంటారు. సాయితేజ్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో పవన్ ఏ స్థాయిలో బాధ పడ్డారో తాజాగా వెల్లడైన సంగతి తెలిసిందే. తారకరత్న ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండగా తారకరత్నకు సంబంధించి బాలయ్య ఎంతో కేర్ తీసుకున్నారు. ఈ గొప్ప క్వాలిటీ చాలా అరుదుగా ఉంటుందని ఈ విషయంలో బాలయ్య, పవన్ గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య, పవన్ రాజకీయాల్లో, సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోలకు మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య, పవన్ వేర్వేరుగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. బాలయ్య, పవన్ కాంబోలో మల్టీస్టారర్ దిశగా అడుగులు పడితే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య, పవన్ మధ్య స్నేహం మరింత బలపడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్ స్టాపబుల్ షో సీజన్ 3 త్వరలో మొదలుకానుందని చరణ్,

కేటీఆర్ కాంబినేషన్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఉండనుందని కామెంట్లు వ్యకమవుతున్నాయి. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సాయిపల్లవి కూడా ఈ షోకు సీజన్3 లో హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య, పవన్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus