స్టార్ యాంకర్లతో పాటు లావణ్య ను కూడా టార్గెట్ చేసిన జి.ఎస్.టి!

Advertisement

గత నెలలో కొందరు టాలీవుడ్ అగ్ర నిర్మాతలతో పాటు.. స్టార్ హీరోల పై కూడా ఐటీ దాడులు జరిగిన సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాని వంటి ‘టైర్ 2’ హీరో పై కూడా ఐటి దాడులు జరిగాయి. వీరి ఆఫీసులతో పాటు ఇళ్ళ పై కూడా సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఇదే పెద్ద సెన్సేషన్ అనుకుంటే.. తాజాగా ఇద్దరు స్టార్ యాంకర్లతో పాటు ఓ టాప్ హీరోయిన్ పై కూడా జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించడం పై పెద్ద చర్చ జరుగుతుంది.

‘అందాల రాక్షసి’ చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన లావణ్య త్రిపాఠి.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ వద్ద ఇంటి పై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. లావణ్యతో పాటు స్టార్ యాంకర్లు సుమ, అనసూయ ల ఇళ్ళపై కూడా జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టి టాక్స్ లు ఎగ్గొట్టడం వల్లనే ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus