వెంకటేష్ మరదలిగా నటించిన ఆ నటి ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ఎవరంటే..?

  • March 16, 2023 / 06:57 PM IST

సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నా.. ఆడియన్స్‌కి ఎక్కువ కాలం గుర్తుండిపోవాలన్నా.. పెద్ద పెద్ద వేషాలు కాకపోయినా కాసేపు అలా కనిపించినా చాలు.. ఆ క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్, క్రియేట్ చేసే ఇంపాక్ట్‌ని బట్టి మంచి రికగ్నైజేషన్ వస్తుంది.. అలాగే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కనిపించిన సుప్రియ జనాలకు గుర్తుండిపోయింది.. కనిపించింది కాసేపే అయినా చూడ చక్కని ఆమె రూపం ప్రేక్షకులకు గుర్తే.. తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ ‘సీతమ్మ వాకిట్లో’ పేరు చెప్తేనే ఠక్కున గుర్తు పట్టేస్తారు..

సుప్రియ అయిసోల తర్వాత శ్రీనివాస్ అవసరాల హీరోగా చేసిన ‘బాబు బాగా బిజీ’ లోనూ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది.. ఆమె పాత్ర కుర్రకారుకి ఫుల్ కిక్కిచ్చింది.. దీంతో యూట్యూబ్‌లోనూ ఈ మూవీకి మాంచి వ్యూస్ వచ్చాయి.. రొమాంటిక్ సన్నివేశాల్లో సహజంగా కనిపిస్తూ కవ్వించేసింది.. తన కైపెక్కించే కళ్లు, మత్తెక్కించే చూపులు, హావభావాలు యూత్ పోరగాళ్ల హృదయాల్లో అలా ముద్ర పడిపోయాయి.. తర్వాత దాదాపు అన్నీ ఆ టైప్ క్యారెక్టర్సే వస్తుండడంతో కాస్త గ్యాప్ తీసుకున్నట్టుంది..

అందుకే ఈమధ్య పెద్దగా కనిపించలేదు కానీ సడెన్‌గా షాక్ లాంటి సర్‌ప్రైజ్ ఇచ్చింది.. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో నటించింది సుప్రియ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కి బీభత్సమైన నెగిటివ్ టాక్ వస్తోంది కానీ చూసే వాళ్లు చూస్తూనే ఉన్నారు.. ముఖ్యంగా వెంకీ లాంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న సీనియర్ యాక్టర్‌ని అలాంటి సీన్లలో చూడలేకపోతున్నామని గోల చేస్తున్నారు..

ఇందులో వెంకీ – రానా తండ్రీకొడుకులుగా కనిపించి ఆకట్టుకున్నారు.. వెంకీకి తమ్ముడు సూర్య పాత్రలో ఆశిష్ విద్యార్థి నటించారు.. ఆయన భార్య పద్మ నాయుడుగా కనిపించింది సుప్రియ.. ఇందులో ఆమె లుక్, ఫిజిక్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూసి షాక్ అయ్యారు ఆడియన్స్.. అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది సుప్రియ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus