‘ఆర్.ఎక్స్.100’ హీరో కి మరో డిజాస్టర్ పడేలా ఉంది..!

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘గుణ 369’. అనఘ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు.

‘మన అనుకున్న వాళ్ళు బాగుండాలంటే.. ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో చెప్పేట్టుండాలి రా గుణ’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషి ‘రూపం వేరు నిజ స్వరూపం వేరు’ అనే డైలాగ్ తో హీరో ఇంట్రడక్షన్ మొదలైంది. ఈ డైలాగ్ కి తగ్గట్టే హీరో రెండు వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. ప్రేమ అంటూ ఓ అమ్మయి వెనుక తిరుగుతూ.. గొడవలకు దూరంగా ఉండే హీరో… కొన్ని పరిస్థితుల వల్ల చాలా వైలెంట్ గా మారినట్టు స్పష్టమవుతుంది.

‘ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడే వాడిని చూసాను కానీ.. ఫోన్ ని అడ్డం పెట్టుకుని.. గంటలు గంటలు మాట్లాడే వాడిని నిన్నే చూస్తున్నాను రా’ అంటూ ‘రంగస్థలం’ ఫేమ్ మహేష్.. హీరోతో చెబుతున్న డైలాగ్ సరదాగా ఉంది. అలాగే ‘నేను ఎడారిలో ఉన్నాను.. గొంతెండిపోతుంది… నిన్ననే నీళ్ళు దొరికాయి.. అవి మంచివా చెడ్డవా అని ఆలోచించే ఓపిక.. తీరిక నాకు లేవు. తాగి దాహం తీర్చుకోవడమే’ అంటూ హీరో చెప్పే డైలాగ్ హైలెట్ అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూస్తుంటే… రొటీన్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది. ‘హిప్పీ’ లాంటి డిజాస్టర్ పడ్డాక కూడా కార్తికేయ నుండీ ఇలాంటి సినిమా చేస్తున్నాడేంటి అనే ఫీలింగ్ కలుగక మానదు. మరి సినిమా ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus